Smartphones: అదిరిపోయే ఫీచర్లతో..రూ.20 వేల లోపు ఫోన్లు ఇవే

24 Oct, 2021 14:31 IST|Sakshi

ఫెస్టివల్‌ సీజన్‌ సందర్భంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈకామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌లు సేల్స్‌ను కొనసాగిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో రూ.20వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, ఆకట్టుకునే మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. 

రెడ్‌ మీ నోట్‌ 10 ప్రో మ్యాక్స్‌ 
20వేల లోపు టాప్‌ వన్‌లో ఉన్న ఫోన్‌ రెడ్‌ మీ నోట్‌ 10ప్రో మ్యాక్స్‌.6.67 అంగుళాల ఫోన్‌లో అమోలెడ్‌ డిస్‌ప్లే, క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌, 732జీ ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌ సదుపాయం ఉంది.120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 100శాతం డీసీఐ -పీ3 వైడ్‌ కలర్‌, హెచ్‌డీఆర్‌-10 సపోర్ట్‌, టీయూవీ లో బ్లూ లైట్‌ సర్టిఫికేషన్‌ (TÜV Rheinland low blue light certification) సదుపాయం ఉంది. ఇక 6జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.18,999గా ఉంది. 

ఒప్పో ఎఫ్‌19ఎస్‌
ఒప్పో ఎఫ్‌19ఎస్‌ 6.43 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, క్వాల్కమ్‌  ఎస్‌ఎం6115 స్నాప్‌ డ్రాగన్‌ ప్రాసెసర్‌,60హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌,409పీపీఐ పిక్సెల్‌ డెన్సిటీ, పీక్‌ బ్రైట్‌నెస్‌ కోసం 800నిట్స్‌ ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం గ్లోయింగ్‌ గోల్డ్‌, గ్లోయింగ్‌ బ్లాక్‌ కలర్స్‌లో అందుబాటులో ఉండగా దీని ధర రూ.19,990 ఉంది. 

శాంసంగ్‌ గెలాక్సీ ఎం51
శాంసంగ్‌ గెలాక్సీ ఎం51' 6.7 అంగుళాల అమోలెడ్‌ ప్లస్‌ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 20:9యాస్పెట్‌ రేషియో, పీక్‌ బ్రైట్‌ నెస్‌ కోసం 420నిట్స్‌, ప్రొటెక్షన్‌ కోసం కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌3, 6జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌ సదుపాయం ఉంది. దీని ధర రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. 

వివోవై73
6.44 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హేలియా జీ 95 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌ సదుపాయం ఉన్న ఈ ఫోన్‌ ధర రూ.19,990గా ఉంది. 

రియల్‌ మీ ఎక్స్‌7 5జీ 
రియల్‌ మీ ఎక్స్‌7 5జీ' 6.55అంగుళా ఫుల్‌ హెచ్‌డీతో అమోలెడ్‌ డిస్‌ప్లే,  మీడియా టెక్‌ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌, 120హెచ్‌ జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 240హెచ్‌జెడ్‌ టచ్‌ శాప్లింగ్‌ రేట్‌, డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ కోసం కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌5, పీక్‌ బ్రైట్‌ నెస్‌ కోసం 1200 నిట్స్‌ ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ ఫోన్‌ రూ.17,000గా ఉంది.

చదవండి: అలెర్ట్‌: మీరు ఆ ఫోన్‌లు వాడుతుంటే ఇకపై వాట్సాప్‌ పనిచేయదు

మరిన్ని వార్తలు