ఉద్యోగులందరూ లేఆఫ్‌.. రియల్‌ ఎస్టేట్‌ యూనిట్‌ను ఎత్తేసిన ప్రముఖ సంస్థ

10 Jun, 2023 19:21 IST|Sakshi

ఆన్‌లైన్‌ మార్ట్‌గేజ్‌ సంస్థ బెటర్‌ డాట్‌ కామ్‌ (Better.com) తాజా లేఆఫ్‌లలో భాగంగా తమ రియల్‌ ఎస్టేట్‌ యూనిట్‌ను మొత్తానికే ఎత్తేసి అందులోని ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. టెక్లూసివ్‌ (TECHLUSIVE) నివేదిక ప్రకారం.. బెటర్‌ డాట్‌ కామ్‌ సీఈవో భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్ 2021 డిసెంబర్‌ నుంచి నుంచి ఇప్పటివరకు యూఎస్‌, భారత్‌ దేశాల్లో 4,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. అయితే తాజా రౌండ్ తొలగింపుల ప్రభావం ఎంత మంది ఉద్యోగులపై పడుతుందో స్పష్టత లేదు.

బెటర్‌ డాట్‌ కామ్‌ అంతర్గత ఏజెంట్ మోడల్ నుంచి భాగస్వామ్య ఏజెంట్ మోడల్‌కు మారాలని యోచిస్తున్నట్లు  నివేదికల ప్రకారం తెలుస్తోంది. 2021 డిసెంబర్ లో జూమ్ కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించినందుకు విశాల్ గార్గ్ విమర్శలు ఎదుర్కొన్నారు. 2022 మే లో ఉద్యోగులు స్వచ్ఛందంగా తప్పుకొనేందుకు అవకాశం ఇవ్వగా దాదాపు 920 మంది రాజీనామాలు చేశారు.

ఈ ఏడాది మార్చి నెలలో అమెజాన్‌, బెటర్‌ డాట్‌ కామ్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా అమెజాన్ ఉద్యోగులు తమ కంపెనీ షేర్లను తనఖా కోసం అవసరమైన ప్రారంభ చెల్లింపునకు ఉపయోగించుకోవచ్చు. ఇందు కోసం 'ఈక్విటీ అన్‌లాకర్' అనే ప్రోగ్రామ్‌ను బెటర్‌ డాట్‌ కామ్‌  పరిచయం చేసింది. ఇది అమెజాన్ ఉద్యోగులు తమ వెస్టెడ్ ఈక్విటీని సెక్యూరిటీగా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు డౌన్ పేమెంట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

బెటర్‌ డాట్‌ కామ్‌ తరచూ ప్రకటిస్తున్న లేఆఫ్‌లు మార్ట్‌గేజ్‌ రంగంలో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత మార్కెట్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్‌ఎస్టేట్‌ ఏజెంట్‌! పరీక్ష రాసి మరీ.. 

మరిన్ని వార్తలు