వాట్సాప్ మెస్సేజ్‌లతో జర జాగ్రత్త.. లేకపోతే మీ ఖాతా ఖాళీ!

17 Nov, 2021 21:09 IST|Sakshi

సైబర్ నెరగాళ్లు రోజుకు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గతంలో ఈ-మెయిల్స్, ఎస్ఎమ్ఎస్ ద్వారా ప్రజలను మోసాగించే నెరగాళ్లు ఇప్పుడు వాట్సాప్ ఉపయోగించి మోసం చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ వాట్సాప్ యాప్ సైబర్ నేరాలకు అడ్డాగా మారింది. తాజా వాట్సాప్ స్కామ్ ట్రిక్ ద్వారా సైబర్ క్రిమినల్స్ మీ కుటుంబ సభ్యులలో ఒకరిగా నటిస్తున్నారు. యుకెకు చెందిన ప్రభుత్వ సంస్థ సఫోల్క్ ట్రేడింగ్ స్టాండర్డ్స్ మోసగాళ్ళు మీ కుటుంబ సభ్యులలో ఒకరిగా నటిస్తూ నకిలీ సందేశాల ద్వారా మిమ్మల్ని లక్ష్యంగా చేస్తున్నారని వాట్సాప్ వినియోగదారులను హెచ్చరించింది.

ఇటీవల జరిగిన ఒక సంఘటనలో, కెసింగ్ లాండ్ కు చెందిన ఒక మహిళ తన కుమార్తె అని పేర్కొంటూ తెలియని నంబర్ నుంచి వాట్సాప్ సందేశాన్ని అందుకుంది. ఆమె వాష్ రూమ్ లో పడిందని, ఇది ఆమె కొత్త కాంటాక్ట్ నెంబరు అని ఆమెను ఒప్పించడానికి సైబర్ క్రిమినల్స్ ప్రయత్నించారు. మోసాగాళ్లు మీ కూతురు మెడికల్ బిల్లు చెల్లించడానికి ఆమెకు డబ్బు పంపమని వాట్సప్ వినియోగదారుని కోరారు. కానీ, అదృష్టవశాత్తూ ఆమె తన ఖాతాను యాక్సెస్ చేసుకోలేకపోయింది. దీంతో ఆమె ఈ భారీ కుంభకోణం నుంచి బయట పడింది. ఆ తర్వాత తన కూతురికి ఫోన్ చేసి అడిగినప్పుడు ఈ విషయం బయటపడింది. దేశంలో వేల కోట్లు రూపాయలు సైబర్ క్రైమ్ వల్ల నష్టపోతున్నట్లు ఇటీవల బయటపడింది. అందుకే, వాట్సాప్ మెస్సేజ్‌లతో జర జాగ్రత్త ఉండాలని.. లేకపోతే మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు.

(చదవండి: ఐరన్‌ మ్యాన్‌ కలను నిజం చేసిన ఆనంద్‌ మహీంద్రా!)

ఇది వాట్సాప్ స్కామ్ అని ఎలా తెలుసుకోవాలి?

  • సైబర్ క్రిమినల్స్ మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
  • అవసరం అయితే అటువంటి అత్యవసర పరిస్థితిని సృష్టిస్తారు. త్వరగా స్పందించడానికి మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తారు.
  • అలాగే వారి సంభాషణను రహస్యంగా ఉంచాలని మిమ్మల్ని అడుగుతారు.

ఈ స్కామ్ నుంచి ఎలా బయటపడాలి?

  • మీరు వారి గుర్తింపును ధృవీకరించాలి. మీకు, మీ కుటుంబానికి మాత్రమే తెలిసిన సమాచారాన్ని అడగడానికి ప్రయత్నించండి.
  • ఆ వ్యక్తి నిజంగా మీకు తెలిసిన వ్యక్తి కాదా అని తెలుసుకోవడానికి టైపింగ్ శైలిని గుర్తించడం మరొక పద్ధతి కావచ్చు.
  • బ్యాంకు అధికారులు ఎన్నడూ మీ ఖాతాకు సంబంధించిన సున్నితమైన వివరాలను అడగరు.
  • మీకు తెలియని వారికి ఎన్నడూ డబ్బు పంపవద్దు. 
  • మీరు ఒక స్కామ్ లేదా సైబర్ మోసగాడి గురించి తెలుసుకుంటే అప్పుడు వాటిని వాట్సాప్ కు తెలియజేయండి.
మరిన్ని వార్తలు