బిగాసస్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌, ధర ఎంత?

21 Oct, 2022 10:00 IST|Sakshi

సరికొత్త డీ15 

హైదరాబాద్‌: బిగాసస్‌ సరికొత్త బీజీ డీ15 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. పూర్తి మెటల్‌ బాడీతో భారత మార్కెట్‌ కోసం భారత్‌లోనే తయారు చేసిన స్కూటర్‌ ఇదని కంపెనీ తెలిపింది. ఒక్కసారి చార్జింగ్‌తో 115 కిలోమీటర్లు ప్రయాణించే డీ15 రోజువారీ కమ్యూటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది.

16 అంగుళాల అలాయ్‌ వీల్స్‌తో బిగాసస్‌ నుంచి వచ్చిన తొలి స్కూటర్‌ ఇదే. మెరుగైన గ్రౌండ్‌ క్లియరెన్స్, 20కు పైగా బ్యాటరీ భద్రతా సదుపాయాలు, 77 సెంటీమీటర్ల పొడవైన సీట్, సైడ్‌ స్టాండ్‌ సెన్సార్‌ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.99,999.  

చదవండి: TwitterDeal మస్క్‌ బాస్‌ అయితే 75 శాతం జాబ్స్‌ ఫట్? ట్విటర్‌ స్పందన

మరిన్ని వార్తలు