BGMI Lite Launch Soon: పబ్జీ లైట్‌ తరహాలో బీజీఎమ్‌ఐ లైట్‌ త్వరలోనే...!

29 Sep, 2021 20:38 IST|Sakshi

పబ్‌జీ ఈ గేమ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఈ గేమ్ ఆడే ఉంటారు. అయితే, ఈ గేమ్ ని దేశ భద్రత కారణాల రీత్యా మన దేశంలో నిషేదించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలై 2న పబ్జీ స్థానంలో  బీజీఎమ్‌ఐను క్రాఫ్టన్‌ తీసుకువచ్చింది. ఈ గేమ్‌ను అత్యధిక సంఖ్యలో యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. బీజీఎమ్‌ఐ లాంటి గేమ్స్‌ హై ఎండ్‌ ర్యామ్‌ ఉన్న ప్లాగ్‌ షిప్‌ ఫోన్లలో సులువుగా పనిచేస్తుంది. 

ర్యామ్‌ తక్కువగా ఉన్న బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లలో బీజీఎమ్‌ఐ అంతగా సపోర్ట్‌ చేయదు. తరుచూ ఫోన్‌ హ్యగ్‌ అవుతోంది. బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను దృష్టిలో ఉంచుకొని పబ్జీ లైట్‌ తరహాలోనే బీజీఎమ్‌ఐ లైట్‌ గేమ్‌ను త్వరలోనే తీసుకురావాలని క్రాఫ్టన్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజీఎమ్‌ఐ లైట్‌ వర్షన్‌తో అధిక సంఖ్యలో యూజర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మురం చేస్తోంది. కాగా లైట్‌ వెర్షన్‌ ఎప్పుడు వస్తుందనే విషయం ఇంకా తెలియలేదు.
చదవండి: ఎస్‌బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్!

మరిన్ని వార్తలు