మెక్సికో మార్కెట్లోకి కోవాగ్జిన్‌

19 Apr, 2022 04:18 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 టీకా కోవాగ్జిన్‌ను మెక్సికో మార్కెట్లో కూడా సరఫరా చేసే దిశగా బయోటెక్నాలజీ సంస్థలు భారత్‌ బయోటెక్, ఆక్యుజెన్‌ తమ ఒప్పందంలో మార్పులు చేశాయి. దీనితో మొత్తం ఉత్తర అమెరికాలో కోవాగ్జిన్‌ విక్రయానికి సంబంధించి ఆక్యుజెన్‌కు హక్కు లభిస్తుంది. అమెరికా మార్కెట్‌ తరహాలోనే లాభాల్లో వాటాల పంపకం రూపంలో ఈ ఒప్పందం ఉంటుందని ఆక్యుజెన్‌ తెలిపింది.

అమెరికా, కెనడా మార్కెట్లలో కోవాక్సిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడం, సరఫరా, విక్రయాల కోసం ఆక్యుజెన్, భారత్‌ బయోటెక్‌ మధ్య ఒప్పందం ఉంది. ప్రస్తుతం 2–18 ఏళ్ల బాలలకు అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్‌ను ఉపయోగించే అంశాన్ని మెక్సికో నియంత్రణ సంస్థ పరిశీలిస్తోందని ఆక్యుజెన్‌ చైర్మన్‌ శంకర్‌ ముసునూరి తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్‌లో కోవాగ్జిన్‌ను వాణిజ్యావసరాలకు ఉత్పత్తి చేసేందుకు ఆక్యుజెన్‌కు పూర్తి తోడ్పాటు అందిస్తామని భారత్‌ బయో చైర్మన్‌ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు