భారతీయ కంపెనీకి అంతర్జాతీయ కాంట్రాక్టు

19 Nov, 2021 12:35 IST|Sakshi

బీడీఎల్‌కు ఎయిర్‌బస్‌ కాంట్రాక్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) తాజాగా ఎయిర్‌బస్‌ నుంచి కాంట్రాక్ట్‌ పొందింది. ఇందులో భాగంగా బీడీఎల్‌ సొంతంగా అభివృద్ధి చేసిన కౌంటర్‌ మెజర్స్‌ డిస్పెన్సింగ్‌ సిస్టమ్‌ను (సీఎండీఎస్‌) ఎయిర్‌బస్‌కు సరఫరా చేయనుంది. డీల్‌ విలువ సుమారు రూ.156 కోట్లు. బీడీఎల్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ ఎన్‌.పి.దివాకర్, ఎయిర్‌బస్‌ డిఫెన్స్, స్పేస్‌ ఎస్‌వీపీ అర్నల్‌ డిడియర్‌ డోమినిక్‌ ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశారు. 

మరిన్ని వార్తలు