Bharat Serums and Vaccines Limited: తెలంగాణలో బయోఫార్మా దిగ్గజం భారీ పెట్టుబడులు..!

13 Apr, 2022 08:06 IST|Sakshi

భారత్‌ సీరమ్స్‌ రూ. 200 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బయోఫార్మా దిగ్గజం భారత్‌ సీరమ్స్‌ అండ్‌ వ్యాక్సిన్స్‌ (బీఎస్‌వీ) తాజాగా హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్, టీకాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 200 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీ రామారావుతో మంగళవారం సమావేశమైన సందర్భంగా బీఎస్‌వీ ఎండీ సంజీవ్‌ నావన్‌గుల్‌ ఈ విషయాలు వెల్లడించారు. ఈ కేంద్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, రేబిస్‌ టీకాలు, హార్మోన్లు మొదలైనవి ఉత్పత్తి చేయనున్నట్లు సంజీవ్‌ వివరించారు.


ప్రపంచ టీకాల రాజధానిగా తెలంగాణ పేరొందిన నేపథ్యంలో.. జీనోమ్‌ వ్యాలీలో భారత్‌ సీరమ్స్‌ రాకను స్వాగతిస్తున్నట్లుగా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగం పటిష్టతకు ఇది నిదర్శనమని, సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు