మొబైల్‌ రీఛార్జ్‌... మోత తప్పదా ?

2 Jul, 2021 10:10 IST|Sakshi

టెలికం టారిఫ్‌లు పెంచాల్సిందే అంటున్న ఎయిర్‌టెల్‌

న్యూఢిల్లీ: టెలికం రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. టారిఫ్‌లు పెరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎయిర్‌టెల్‌ వెనుకంజ వేయబోదని పేర్కొన్నారు. అయితే ఇది ఏకపక్షంగా చేయలేమని వెల్లడించారు.

ఒకరినొకరు...

టెలికం టారిఫ్‌లపై సునీల్‌ మిట్టల్‌ మాట్లాడుతూ... ‘ఒకరినొకరు చంపడం ఎంతకాలం కొనసాగించగలరు. చాలా కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. టారిఫ్‌లను పెంచడం ఎల్లప్పుడూ చెడ్డదిగా అనిపిస్తుంది. గతంలో ఉన్న స్థాయికి తిరిగి తీసుకురండి. ప్రభుత్వం, అధికారులు, టెలికం శాఖ ప్రస్తుత సమస్యపై దృష్టిసారించాలి. భారత డిజిటల్‌ కల చెక్కుచెదరకుండా చూసుకోవాలి. భారతి ఎయిర్‌టెల్‌ ఈక్విటీ మరియు బాండ్ల ద్వారా సమయానుసారంగా తగినంతగా నిధులను సేకరించింది. రాబోయే సంవత్సరాల్లో మార్కెట్‌కు సేవ చేయడానికి కంపెనీ బలంగా ఉంది’ అని వివరించారు.   
 

చదవండి గుడ్ న్యూస్: ఉచితంగా మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్‌ సాఫ్ట్‌వేర్

మరిన్ని వార్తలు