తప్పు చేశాడు.. ఫలితం అనుభవిస్తున్నాడు..

8 Mar, 2022 08:33 IST|Sakshi

గ్రోవర్‌పై వేటు విషయంలో బోర్డు భేష్‌ 

వేగంగా స్పందించాల్సి వచ్చింది

భారత్‌పే సహవ్యవస్థాపకుడు శాశ్వత్‌  

న్యూఢిల్లీ: అక్రమాలకు పాల్పడిన కంపెనీ సహవ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్‌ను పదవి నుంచి తొలగించే విషయంలో బోర్డు వేగంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించినట్లు భారత్‌పే సహవ్యవస్థాపకుడు శాశ్వత్‌ నక్రానీ పేర్కొన్నారు. పీడబ్ల్యూసీ నివేదికను అందుకున్నాక బోర్డు తగిన విధంగా స్పందించినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో తెలియజేశారు. 

కంపెనీలో కార్యకలాపాలలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో గత వారం గ్రోవర్‌ను అన్ని పొజిషన్ల నుంచీ తప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చట్టపరమైన చర్యలకు సైతం ఉపక్రమించనున్నట్లు భారత్‌పే బోర్డు వెల్లడించింది. అష్నీర్‌ గ్రోవర్‌ కంపెనీ ఉద్యోగిగా ఇకపై భారత్‌పేతో ఎలాంటి సంబంధాలూ కలిగి ఉండరని శాశ్వత్‌ లేఖలో పేర్కొన్నారు. కంపెనీ సహవ్యవస్థాపకుడు లేదా డైరెక్టర్‌గా ఉండబోరని తెలియజేశారు. 

ఈ నెల 1 అర్ధరాత్రి గ్రోవర్‌ బోర్డుకి రాజీనామా చేసినట్లు ప్రస్తావించారు. గ్రోవర్‌ కుటుంబం, ఇతర బంధువులు కంపెనీ నిధులను దుర్వినియోగం చేయడంతోపాటు పలు అక్రమాలకు పాల్పడినట్లు లేఖలో వివరించారు. కంపెనీపట్ల తప్పుడు వివరణ ఇచ్చేందుకు గ్రోవర్‌ ప్రయత్రించినట్లు తెలియజేశారు. 
 

చదవండి: Bharatpe: చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్‌ అయిపోయింది

మరిన్ని వార్తలు