Bharatpe: బంగారం రుణాల విభాగంలోకి భారత్‌పే

15 Mar, 2022 12:07 IST|Sakshi

ముంబై: ఫిన్‌టెక్‌ సంస్థ భారత్‌పే తాజాగా బంగారం రుణాల విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం కొన్ని నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలతో (ఎన్‌బీఎఫ్‌సీ) చేతులు కలిపింది. బంగారం తనఖాపై రూ. 20 లక్షల వరకూ రుణాలు ఆఫర్‌ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల్లో తమ వ్యాపార కస్టమర్లకు ఈ సర్వీసు అందుబాటులో ఉందని భారత్‌పే తెలిపింది. దీన్ని ఈ ఏడాది ఆఖరు నాటికి 20 నగరాలకు విస్తరించనున్నట్లు, సుమారు 500 కోట్ల మేర రుణాలు మంజూరు చేయగలమని ఆశిస్తున్నట్లు వివరించింది.

వడ్డీ రేటు వార్షికంగా అత్యంత తక్కువగా సుమారు 4.7 శాతంగా ఉంటుందని, దరఖాస్తు ప్రక్రియ.. రుణ వితరణ డిజిటల్‌ పద్ధతిలో 30 నిమిషాల్లోపే పూర్తి కాగలదని పేర్కొంది. 6,9,12 నెలల కాల వ్యవధికి కస్టమర్లు రుణాలు తీసుకోవచ్చని భారత్‌పే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుహెయిల్‌ సమీర్‌ తెలిపారు. రెండు నెలల పాటు పైలట్‌ ప్రాతిపదికన పసిడి రుణాల స్కీమ్‌ను పరీక్షించామని, రూ. 10 కోట్ల వరకు రుణాలు మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు