భారత్‌పే కో-ఫౌండర్‌, మాజీ ఎండీకి భారీ షాక్‌!

9 Dec, 2022 14:43 IST|Sakshi

అష్నీర్‌ గ్రోవర్‌పై భారత్‌పే కేసు

రూ.88.67 కోట్ల నష్టపరిహారం డిమాండ్‌   

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్‌ టెక్నాలజీ యునికార్న్‌ భారత్‌పే-తన మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), సహ వ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్, ఆయన కుటుంబంపై క్రిమినల్‌ కేసు, సివిల్‌ దావా దాఖలు చేసింది.  మోసం, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై రూ. 88.67 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాలని భారత్‌ పే డిమాండ్‌ చేసింది.

ఇది చదవండి:  రోడ్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్

దాదాపు 2,800 పేజీల ఫిర్యాదులో భారత్‌పే గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్, ఇతర కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. నకిలీ బిల్లుల చెల్లింపు, కంపెనీకి సేవలు అందించడానికి కల్పిత విక్రేతల సృష్టి, రిక్రూట్‌మెంట్‌ కోసం కంపెనీకి అధిక చార్జీ వంటి ఆరోపణలు ఇందులో ఉన్నాయి. ఫిర్యాదుపై ఢిల్లీ హైకోర్టు గ్రోవర్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానాలు చెప్పాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా పడింది. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?)

నైపథ్యం ఇదీ.. 
నైకా ఐపీఓ కోసం నిధులను పొందడంలో విఫలం కావడానికి సంబంధించి కోటక్‌ గ్రూప్‌ ఉద్యోగిపై గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్‌ గ్రోవర్‌ అనుచిత పదజాలం ఉపయోగించి, బెదిరించిన కేసులో ఈ సంవత్సరం ప్రారంభంలో నాలుగు సంవత్సరాల భారత్‌పే వార్తల్లో నిలిచింది. ఈ పరిస్థితిల్లో సంస్థ కార్పొరేట్‌ పాలన సమీక్షను నిర్వహించడానికి, గ్రోవర్‌ ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడో లేదో తెలుసుకోవడానికి అల్వారెజ్‌ మార్సల్, శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళదాస్, పీడబ్ల్యూసీలను భారత్‌పే నియమించింది.

ఇది మార్చిలో కంపెనీ, ఆ సంస్థ బోర్డు నుండి గ్రోవర్, ఆయన భార్య తొలగింపునకు దారితీసింది. వారితోపాటు దుష్ప్రవర్తనకు పాల్పడిన ఉద్యోగులందరిపై  చర్యలు తీసుకో వాలని సంస్థ నిర్ణయించింది. అష్నీర్‌ గ్రోవర్‌  నిరోధిత షేర్లను వెనక్కి తీసుకోవడంసహా, ఆయన పా ల్పడిన అవకతవకలపై చర్యలకూ ఉపక్రమించింది.  

ఇదీ  చదవండి:  వర్క్‌ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు