Airtel: స్పేస్‌ స్టార్టప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్‌టెల్‌

30 Jun, 2021 07:45 IST|Sakshi

వన్‌వెబ్‌లో భారతీ గ్రూప్‌ భారీ పెట్టుబడులు

తాజాగా రూ. 3,700 కోట్లకు రెడీ 

న్యూఢిల్లీ: శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీ వన్‌వెబ్‌లో సునీల్‌ మిట్టల్‌కు చెందిన భారతీ గ్రూప్‌ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తాజాగా 50 కోట్ల డాలర్లు(రూ. 3,700 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనుంది. తద్వారా వన్‌వెబ్‌లో భారతీ గ్రూప్‌ అతిపెద్ద వాటాదారుగా అవతరించనుంది. దివాలా పరిస్థితులకు చేరిన వన్‌వెబ్‌ను గతేడాది యూకే ప్రభుత్వం ఆదుకుంది.

గ్లోబల్‌ ఎల్‌ఈవో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ వన్‌వెబ్‌లో కాల్‌ ఆప్షన్‌లో భాగంగా భారతీ గ్రూప్‌ తాజా పెట్టుబడులను చేపట్టనుంది. మరోవైపు యూటెల్‌సాట్‌ 55 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ లావాదేవీల తదుపరి భారతీకి వన్‌వెబ్‌లో 38.6 శాతం వాటా లభించనుంది. యూకే ప్రభుత్వం, యూటెల్‌సాట్, సాఫ్ట్‌బ్యాంక్‌ విడిగా 19.3 శాతం చొప్పున వాటాలు పొందనున్నాయి. 

చదవండి: SBI: ఎస్‌బీఐ ‘బేసిక్‌’ కస్టమర్లకు షాక్‌

>
మరిన్ని వార్తలు