Bharti Airtel: కంపెనీలో వారికి ఆహ్వానం పలకనున్న ఎయిర్‌టెల్‌..!

26 Jan, 2022 08:47 IST|Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ వ్యూహాత్మక పెట్టుబడిదారు సంస్థను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ప్రిఫరెన్షియల్‌ ఈక్విటీ షేర్ల జారీని చేపట్టనున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. పెట్టుబడుల అంశాన్ని ఈ నెల 28న(శుక్రవారం) నిర్వహించనున్న వాటాదారుల సమావేశంలో బోర్డు చర్చించనున్నట్లు తెలియజేశాయి.

రుణ చెల్లింపుల ఒత్తిడి వంటి అంశాలుకాకుండా దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలకు అనుగుణంగా మాత్ర మే పెట్టుబడిదారు సంస్థకు ఈక్విటీ జారీ యోచనలో ఉన్నట్లు వివరించాయి. వెనువెంటనే పెట్టుబడుల ఆవశ్యకత లేనప్పటికీ భారతీ ఎయిర్‌టెల్‌ ప్రిఫరెన్షియల్‌ ఈక్విటీ జారీ యోచన చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు జెఫరీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ నివేదికలో పేర్కొనడం గమనార్హం. 

ఈ వార్తల నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు బీఎస్‌ఈలో 3.25 శాతం లాభపడి రూ. 712 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు