స్పెక్ట్రం కోసం ఎయిర్‌టెల్‌ రూ. 8 వేల కోట్లు చెల్లింపు

18 Aug, 2022 06:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల వేలంలో కొనుగోలు చేసిన 5జీ స్పెక్ట్రంనకు సంబంధించి టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ కేంద్రానికి రూ. 8,312.4 కోట్లు చెల్లించింది. నాలుగేళ్లకు సరిపడా వాయిదాల మొత్తాన్ని టెలికం శాఖకు (డట్‌) ముందస్తుగా చెల్లించినట్లు సంస్థ తెలిపింది. దీనితో తాము ఇక పూర్తిగా 5జీ సేవలను అందుబాటులోకి తేవడంపైనే దృష్టి పెట్టేందుకు వీలవుతుందని సంస్థ ఎండీ గోపాల్‌ విఠల్‌ తెలిపారు.

తగినంత స్పెక్ట్రం, అత్యుత్తమ టెక్నాలజీ, పుష్కలంగా నిధుల ఊతంతో ప్రపంచ స్థాయి 5జీ సేవల అనుభూతిని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌టెల్‌ రూ. 43,039.63 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. ఇందులో ముందుగా రూ. 3,849 కోట్లు, తర్వాత 19 ఏళ్ల పాటు మిగతా మొత్తాన్ని విడతలవారీగా చెల్లించేందుకు ఎయిర్‌టెల్‌కు అవకశం ఉంది.

మరిన్ని వార్తలు