భారతీ టెలికంకు సింగ్‌టెల్‌ వాటా

26 Aug, 2022 06:13 IST|Sakshi

3.33 శాతం వాటా కొనుగోలుకు రెడీ

న్యూఢిల్లీ: ప్రమోటర్‌ భారతీ టెలికం.. కంపెనీలో సింగ్‌టెల్‌కు గల 3.33 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తాజాగా పేర్కొంది. మాతృ సంస్థ భారతీ టెలికం ఈ వాటాను 90 రోజుల్లోగా సొంతం చేసుకోనున్నట్లు తాజాగా తెలియజేసింది. ఇందుకు 2.25 బిలియన్‌ సింగపూర్‌ డాలర్ల(రూ. 12,895 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది.

కాగా.. భారతీ టెలికంలో భారతీ గ్రూప్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ కుటుంబంతోపాటు, సింగ్‌టెల్‌ సైతం ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్‌ గ్రూప్‌ వాటా 29.7 శాతానికి చేరనుంది.  రెండు సంస్థల మధ్య ఈ లావాదేవీ పూర్తయ్యాక ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం ప్రధాన వాటాదారుగా కొనసాగనున్నట్లు సునీల్‌ మిట్టల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు