భారత్‌పేకు మరో షాక్‌, కీలక కో-ఫౌండర్‌ ఔట్‌!

2 Aug, 2022 17:17 IST|Sakshi

నెలల వ్యవధిలోనే భారత్‌పేకు మరో బిగ్‌ షాక్‌

టెక్‌ బ్యాక్‌బోన్‌ భావిక్ కొలాదియా ఔట్‌!

సాక్షి, ముంబై: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పేకు మరో షాక్‌  తగిలింది.సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ రాజీనామా చేసిన కొన్ని నెలల వ్యవధిలోనే రెండో వ్యవస్థాపకుడు భావిక్ కొలాదియా సంస్థకు గుడ్‌బై చెప్పడం గమనార్హం. ఇప్పటికే నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఇబ్బందులు పడుతున్న భారత్‌పే కంపెనీకి, కంపెనీ ఐటీ బ్యాక్‌బోన్‌గా ఉన్న  కిలాదియా వైదొలిగారు.

ఆయన కాంట్రాక్ట్ పదవీకాలం జూలై 31, 2022తో ముగిసిందని, అయితే కంపెనీ వీడేందుకే కొలాదియా నిర్ణయించుకున్నారని  కంపెనీ ఆగస్టు 2న ఒక ప్రకటనలో తెలిపింది.అతిపెద్ద ఫిన్‌టెక్ కంపెనీలలో ఒకటిగా మారిన కృషిన ఆయన అంతర్భాగంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైనప్పుడు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారని నమ్ముతున్నాయని కంపెనీ తెలిపింది. మరోవైపు భారత్‌పే తన అతిపెద్ద పెట్టుబడులలో ఒకటని, రానున్న కాలంలో కూడా పెట్టుబడులు  కొనసాగిస్తానని కొలాడియా చెప్పారు. పనిని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పారు. అలాగే  భారత్‌పేని స్థాపించిన రోజు నుంచి తాను, శాశ్వత్‌  భారత్‌పే, స్థాపించడంతోపాటు, దాని  అభివృద్ధికి కృషి చేశామని చెప్పుకొచ్చారు.

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ కంపెనీ  BharatPeకి సహ వ్యవస్థాపకుడు, ఎంపీ అష్నీర్ గ్రోవర్ కంపెనీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అష్నీర్ గ్రోవర్ రాజీనామా తర్వాత భారత్‌పే బోర్డు ఆయనతో పాటు ఆయన భార్య కంపెనీ నిధుల్లో భారీ అవకతవకలు చేసిన ఆరోపణలు, తర్వాత బోర్డు గ్రోవర్ మధ్య వివాదం చివరికి గ్రోవర్‌ రాజీనామాకు దారి తీసింది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రోవర్, భరత్‌పే మేనేజ్‌మెంట్ మధ్య వివాదం చెలరేగినప్పుడు, కొలాడియా, గ్రోవర్ మధ్య వాగ్వాదం ఆడియో రికార్డ్‌ బయటపడటం కలకలం రేపింది. 

అటు మనీకంట్రోల్ రిపోర్టు ప్రకారం, కీలక ఎగ్జిక్యూటివ్‌లు వరుసగా కంపెనీకి గుడ్‌ బై చెప్పారు. కంపెనీ వ్యవస్థాపక సభ్యుడు సత్యం నాథనిగత జూన్‌లో రాజీనామా చేశారు. ప్రధాన రెవెన్యూ అధికారి నిషిత్ శర్మ  సంస్థాగత రుణ భాగస్వామ్య అధిపతి చంద్రిమా ధర్ నిష్క్రమించారు. ఆ తరువాత  కొద్ది రోజులకే మరో కీలకమైన టెక్‌ నిపుణుడు నథాని కంపెనీని వీడారు.

మరిన్ని వార్తలు