Ola Scooters : యాప్‌ లాక్‌ వచ్చేసిందోచ్‌!

21 Apr, 2022 13:30 IST|Sakshi

ఓలా యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాప్‌ లాక్‌ (డిజిటల్‌ కీ) అప్‌డేట్‌ వచ్చింది. ఈ డిజిటల్‌ కీ ఎలా పని చేస్తుందనే విషయాలను వీడియో రూపంలో ఓలా ఫౌండర్‌ భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ అప్‌డేట్‌ అతి త్వరలోనే ఓలా ఎస్‌ 1, ఓలా ఎస్‌ 1 ప్రో మోడళ్లలో ఓవర్‌ ది ఎయిర్‌ (ఓటీఏ) ద్వారా అందివ్వనున్నారు.

ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో లేటెస్ట్‌ టెక్నాలజీ ఉపయోగించారు. నావిగేషన్‌, మ్యూజిక్‌, డిజిటల్‌ కీ వంటి ఫీచర్లన్నింటినీ టచ్‌ స్క్రీన్‌ రూపంలో కన్సోల్‌ ఏరియాలో పొందు పరిచారు. అయితే ఇందులో అనేక యాప్‌లు ప్రస్తుతం లాక్‌డ్‌గా ఉన్నాయి. క్రమంగా ఒక్కో ఫీచర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను మూవ్‌ ఓస్‌2 పేరుతో రిలీజ్‌ చేస్తూ అన్‌లాక్‌ చేస్తోంది ఓలా. తాజాగా డిజిటల్‌ కీని అన్‌లాక్‌ చేయబోతున్నట్టు తెలిపింది. 

డిజిటల్‌ కీ అప్‌డేట్‌ అందుబాటులోకి వస్తే ఓలా స్కూటర్‌ ఆన్‌, ఆఫ్‌ చేసేందుకు ఫిజికల్‌ కీ అవసరం ఉండదు. మొబైల్‌ ఫోన్‌లో ఓలాస్కూటర్‌ యాప్‌ ద్వారానే ఆన్‌ ఆఫ్‌ చేసుకునే వీలు కలుగుతుంది.

చదవండి: ఓలా స్కూటర్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన భవీశ్‌ అగర్వాల్‌

మరిన్ని వార్తలు