మొదటి ఓలా స్కూటర్‌ ఇదే... ఓ లుక్కేయ్యండి !

15 Aug, 2021 10:48 IST|Sakshi

ప్రీ బుకింగ్స్‌తోనే వరల్డ్‌ రికార్డు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఫస్ట్‌ లుక్‌ని ఆ కంపెనీ సీఈవో భవీష్‌ అగర్వాల్‌ రివీల్‌ చేశారు. తమిళనాడులో ఉన్న ఫ్యాక్టరీలో తయారైన మొట్ట మొదటి ఓలా మొదటి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఫోటోని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఫిబ్రవరిలో స్కూటర్‌ తయారీ పనులు మొదలు పెట్టామని, కంపెనీ ఉద్యోగులు ఎంతో శ్రమించి ఈ స్కూటర్‌ని తయారు చేశారని ఆయన వెల్లడించారు. 

పెట్రోలు ధరల పెరుగుదలతో ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్న వారికి ఓలా ఊరట ఇచ్చింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ స్కూటర్‌కి సంబంధించిన ఒక్కో ఫీచర్‌ని ట్విట్టర్‌ ద్వారా భవీష్‌ అగర్వాల్‌ వెల్లడిస్తూ వస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ స్కూటర్‌కి సంబంధించిన అన్ని వివరాలను ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నారు. 

మరిన్ని వార్తలు