రణ్‌వీర్‌ సింగ్‌ నగ్న ఫోటోతో..భవిష్‌ అగర్వాల్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజీ!

24 Jul, 2022 09:44 IST|Sakshi

కార్పొరేట్‌ వరల్డ్‌లో బ్రాండ్‌ వ్యాల్యూ చాలా ముఖ్యం. ఒక్కసారి పోగొట్టుకుంటే నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇటీవలి కాలంలో ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించిన ఓలా పరిస్థితి తారుమారైంది. వెహికల్స్‌లోని లోపాలు ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే ఆ సంస్థ అధినేత భవిష్‌ అగర్వాల్‌ తన మార్కెటింగ్‌ స్ట్రాటజీతో బ్రాండ్‌ వ్యాల్యూని నిలబెట్టి.. అమ్మకాలు పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 
 

అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ల
అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ల వరకు అమ్మకాలు జరిపేందుకు కార్పొరేట్‌ దిగ్గజాలు మూడు మార్కెటింగ్‌ స్ట్రాటజీస్‌ను ఫాలో అవుతుంటాయి. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పిన ఈథోస్‌, పాథోస్‌,లోగోస్‌ టెక్నిక్‌ను ఉపయోగించి ప్రొడక్ట్‌లను సేల్‌ చేస్తుంటాయి. మిగిలిన కార్పొరేట్‌ కంపెనీల మార్కెటింగ్‌ స్ట్రాటజీ ఎలా ఉన్నా..భవిష్‌ అగర్వాల్‌ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్‌ వెహికల్స్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను పోల్చుతూ..తాజాగా పేపర్‌ మ్యాగజైన్‌ కోసం నగ్నంగా ఫోజులిచ్చిన స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఫోటోల్ని ట్వీట్‌ చేశారు.

పెట్రోల్‌ వాలా వర్సెస్‌ ప్రోవాలా
భవిష్‌ ట్వీట్‌లో నేలపై నగ్నంగా కూర్చొన‍్న రణ్‌వీర్‌ సింగ్ ఫోటోకు 'పెట్రోల్ వాలా' అని.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నగ్నంగా డ్యాన్స్‌ ఫోజ్‌ పెట్టిన రణ్‌వీర్‌ ఫోటోకు 'ప్రో వాలా' అని పేర్కొన్నారు. పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో తగ్గిపోతున్న పెట్రో వాహనాల వినియోగం తగ్గుతుందని..ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ఈవీ వెహికల్స్‌ డిమాండ్‌ను హైలెట్‌ చేస్తూ మరికొన్ని మీమ్స్‌ నెటిజన్లతో పంచుకున్నారు. 

ఈవీ వెహికల్స్‌ కాలిపోతుంటాయ్‌
ఆసక్తికరమైన విషయమేమిటంటే, అగర్వాల్ ఈ తరహాలో ట్వీట్‌ చేయడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది జూన్‌లో అగ్నికి ఆహుతైన టాటా నెక్సాన్ ఈవీ విజువల్స్‌పై స్పందించారు. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. విదేశాల్లో తయారైన వెహికల్స్‌ సైతం కాలిపోతుంటాయి. ఈవీ వెహికల్స్‌తో పోలిస్తే పెట్రో ఇంజిన్‌ (ఐసీఈ)లకే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటాయంటూ ఆటోకార్ ఇండియా ఎడిటర్ హోర్మజ్డ్ సోరాబ్జీని కూడా ట్యాగ్ చేశారు. ఏది ఏమైనా ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మార్కెటింగ్‌ మహరాజుగా పేరొందిన భవిష్‌ అగర్వాల్‌..ఓలా ఈవీ వెహికల్స్‌ అమ్మకాల కోసం ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తారో చూడాలి' అంటూ ఆటోమొబైల్‌ మార్కెట్‌ నిపుణులు చమత్కరిస్తున్నారు.

మరిన్ని వార్తలు