బీహెచ్‌ఈఎల్‌ లాభం హైజంప్‌

11 Feb, 2023 13:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ దిగ్గజం బీహెచ్‌ఈఎల్‌ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 56 శాతంపైగా జంప్‌చేసి రూ. 42 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 27 కోట్లు మాత్రమే ఆర్జించింది.

మొత్తం ఆదాయం మాత్రం రూ. 5,220 కోట్ల నుంచి రూ. 5,354 కోట్లకు స్వల్పంగా బలపడింది. పన్నుకుముందు లాభం 60 శాతం ఎగసి రూ. 53 కోట్లకు చేరింది. విద్యుత్‌ విభాగం నుంచి ఆదాయం 7 శాతం బలపడి రూ. 3,992 కోట్లను దాటింది. ఇండస్ట్రీ విభాగం టర్నోవర్‌ 21 శాతం క్షీణించి రూ. 947 కోట్లకు పరిమితమైంది. కంపెనీలో ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది. 
ఫలితాల నేపథ్యంలో బీహెచ్‌ఈఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.6 శాతం క్షీణించి రూ. 75 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు