లాభాల్లోకి బీహెచ్‌ఈఎల్‌, క్యూ4లో రూ.916 కోట్లు!

23 May, 2022 21:22 IST|Sakshi

ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(బీహెచ్‌ఈఎల్‌) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ.916 కోట్ల నికర లాభం ఆర్జించింది.

 అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ.1,036 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ.0.40 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో  మొత్తం ఆదాయం సైతం రూ.7,245 కోట్ల నుంచి రూ.8,182 కోట్లకు బలపడింది. ఇక మొత్తం వ్యయాలు రూ.8,644 కోట్ల నుంచి రూ.7,091 కోట్లకు వెనకడుగు వేశాయి.

కోవిడ్‌ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులను కల్పించినట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు తెలియజేసింది. 
 
   

మరిన్ని వార్తలు