బీహెచ్‌ఈఎల్‌షేరు ఢమాల్‌: ఎందుకంటే

8 Feb, 2021 14:55 IST|Sakshi

సాక్షి, ముంబై: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్  (బీహెచ్ఈఎల్) కు ఫలితాల షాక్‌ తగిలింది. క్యు3లో  ఆర్థికఫలితాలు తీవ్రంగా నిరాశ పరచడంతో సోమవారం నాటి మార్కెట్‌లో బీహెచ్‌ఈఎల్‌ భారీ పతనాన్ని నమోదు చేసింది. గత వరుస 5 రోజులుగా లాభపడిన షేరు సోమవారం 8.5 శాతానికి పైగా నష్టపోయింది. ఫలితంగా కీలకమైన రూ. 40 దిగువకు చేరింది. ఇది ఇన్వెస్టర్ల సెంటి మెంటును  మరింత దెబ్బ తీసింది. 

2020 ఆర్థిక సంవత్సరం క్యు3లో  218కోట్ల నికర నష్టాలను నమోదు చేసిన  కంపెనీ, మార్కెట్ వర్గాలను  భారీగా నిరాశపర్చింది. అలాగే  ఆదాయం క్యూ 3 లో రూ .4,532 కోట్లకు పడిపోయింది.  దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ 14,067 కోట్ల రూపాయలకు  చేరింది.  మొత్తం ఆపరేటింగ్ నష్టాలు రూ.180కోట్లకు పెరిగాయి. మరోవైపు  కరోనా మహమ్మారి  సంక్షోభం,  ఆర్డర్ల క్షీణత కూడా  కంపెనీ  లాభాలను దెబ్బతీసిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో బ్రోకరేజ్‌ సంస్థ నోమురా ఈ షేరుకు సెల్‌ కాల్‌ ఇచ్చింది. రికవరీ ఆశలు కనిపించని నేపథ్యంలో బలహీనత  కొనసాగుతుందని గోల్డ్‌మన్ సాచ్స్  అంచనా వేసింది. షేరు టార్గెట్ ధర రూ .25గా తెలిపింది.

మరిన్ని వార్తలు