భీమ జ్యువెల్స్‌ మెగా బంపర్‌ డ్రా: గిప్ట్‌గా సిట్రోయెన్‌ కార్లు

25 Nov, 2022 13:17 IST|Sakshi

హైదరాబాద్‌: భీమ జ్యువెల్స్‌ 98వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన బంపర్‌ లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేసింది. సోమాజీగూడకు చెందిన  రామ సుబ్బమ్మ, విపుల్‌ సిట్రోయెన్‌ కార్లను గెలుచుకున్నారు. భీమ సూపర్‌ సర్‌ప్రైజ్‌లో భాగంగా కస్టమర్లకు బంగారం, వెండి, వజ్రాల కొనుగోలుపై భారీ తగ్గింపు ఇచ్చింది.

బంగారం, వెండి నాణేలతో పాటు ఇతర బహుమతులు కూడా అందజేసింది. ప్రతి దుకాణానికి సిట్రోయెన్‌ కారు ఇచ్చింది. ఈవెంట్‌లో లక్కీ విజేతలను ప్రకటించడం మరపురాని అనుభవమని కంపెనీ రీజినల్‌ బిజినెస్‌ హెడ్‌ రఘురామ్‌ రావు తెలిపారు. వ్యాపారవేత్త షేక్‌ అబ్దుల్‌ వాజీద్, బిల్డర్‌ కనకరాజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భీమ జ్యువెల్స్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 14 నుంచి నవంబర్‌ 13 వరకు నెలరోజుల పాటు ఘనంగా వార్షికోత్సవాలను నిర్వహించింది. 
 

మరిన్ని వార్తలు