ఆ నిర్ణయంతో చిన్న కార్లకు కష్టకాలమే!

1 Jun, 2022 09:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ తప్పనిసరి ఉండాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై దేశీయ వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా స్పందించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించింది. ఇప్పటికే తగ్గుతున్న చిన్న కార్ల మార్కెట్‌పై ప్రతిపాదిత నిబంధన తీవ్ర ప్రభావం చూపిస్తుందని సంస్థ చైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ వెల్లడించారు. వాహన రంగంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

‘మూడేళ్లుగా చిన్న కార్ల విభాగం అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశాలను దెబ్బతీస్తుంది.  ధరలు దూసుకెళ్తుండడంతో మెట్రోయేతర ప్రాంతాల్లో విక్రయాలు తగ్గాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ తప్పనిసరి అయితే ధర రూ.20–25 వేల దాకా అధికం అవుతుంది. చిన్న కారు కొనుగోలుదార్లకు ఇది భారమే’ అని భార్గవ వివరించారు.    

మరిన్ని వార్తలు