ఊహించని షాక్‌.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్‌ డిమాండ్‌, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు!

21 Nov, 2022 13:38 IST|Sakshi

ఇటీవల ప్రజలు కారు కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కంపెనీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఫీచర్లతో కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. వాటి సేల్స్‌ కూడా బాగానే జరుగుతున్నాయి. అయితే హ్యుందాయ్ కంపెనీలోని ఓ మోడల్‌ కారుని ప్రజలు ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. గతంలో ఈ కారుకి ఫుల్ డిమాండ్. మధ్యతరగతి ప్రజలు ఈ కార్లే కావాలని కొనేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది.  

ఒక్క కారు కూడా కొనలేదు
హ్యుందాయ్ కంపెనీలోని శాంత్రో (Santro) మోడల్‌ కారు మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే పలు కారణాల వల్ల సంస్థ ఈ కారు ఉత్పత్తిని మే 2022లో కంపెనీ నిలిపివేసినప్పటికీ, దాని మూసివేత ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు.

ఈ కారు స్టాక్‌ను క్లియర్ చేయాలనుకోవడం దీనికి కారణం. వాస్తవానికి, ఇప్పటికీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కారు జాబితా ఉంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. అయినా స్టాక్‌ క్లియర్‌ చేయలేకపోతోంది. మరోవైపు ఈ కారు సేల్స్‌ క్రమక్రమంగా పడిపోతూ వస్తోంది. అలా ఏకంగా గత అక్టోబర్‌ నెలలో దీన్ని అమ్మకాలు జీరోగా ఉంది.

ఇది కంపెనీకి భారీ షాక్‌ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఫ్యామిలీ కారుగా గుర్తింపు సాధించింది శాంత్రో ప్రస్తుతం దాని సెకండ్‌ ఇన్నింగ్స్ మాత్రం చాలా నిరాశపరిచింది. ఏడాది కిందట చూస్తే.. శాంట్రో అమ్మకాలు 2877 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ 2018లో శాంత్రో కారును రీలాంచ్ చేసి దీని ప్రారంభ ధర రూ. 3.9 లక్షలుగా ని​ర్ణయించింది. అయితే నాలుగేళ్ల కాలంలో ఈ కారు ప్రారంభ ధర రూ. 5.7 లక్షలకు చేరింది. ఇక ధర పెరగడంలో కొనే వారు కరువైనట్లు తెలుస్తోంది.

చదవండి: గుడ్‌న్యూస్‌: కొత్త సేవలు వచ్చాయ్‌.. ఇలా చేస్తే ఇంట​ర్నెట్‌ లేకున్నా యూపీఐ పేమెంట్స్‌!

మరిన్ని వార్తలు