ఆపిల్‌ కంపెనీకి భారీ షాక్‌..!

17 Aug, 2021 21:20 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ప్రముఖ వైర్‌లెస్‌ స్పీకర్ల తయారీదారు సోనోస్‌ గూగుల్‌ కంపెనీపై యూఎస్‌ ఫెడరల్‌ కోర్టు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గూగుల్‌ హోమ్‌ స్మార్ట్‌ స్పీకర్స్‌ ఉత్పత్తుల విషయంలో ఐదు పేటెంట్‌ హక్కులను ఉల్లంఘించినట్లు ఫెడరల్‌ కోర్టు గుర్తించింది. అంతేకాకుండా 1930 ఫెడరల్‌ టారిఫ్‌ చట్టాలను గూగుల్‌ ఉల్లంఘించినట్లు కోర్టు నిర్దారించింది. కాగా గూగుల్‌పై భారీ జరిమానాలను విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆపిల్‌ కూడా అదే బాటలో..
తాజాగా ఆపిల్‌ కూడా గూగుల్‌  బాటలో నడుస్తూ హద్దు మీరుతుంది. యూఎస్‌ ఫెడరల్‌ కోర్టులో ఆపిల్‌ పేటెంట్‌ హక్కులపై జరుగుతున్న విచారణలో ఆపిల్‌ ఓడిపోయింది. ఆపిల్‌ ఇతర కంపెనీలకు చెందిన పేటెంట్ల హక్కులను కాలారాసినట్లు కోర్టు గుర్తించింది. కాగా ఆపిల్‌పై యూఎస్‌ ఫెడరల్‌ కోర్టు సుమారు 300 మిలియన్ల డాలర్ల జరిమానాను విధించింది.

అప్టిస్‌ వైర్‌లేస్‌ టెక్నాలజీ కంపెనీకి చెందిన పేటెంట్‌ హక్కులను ఆపిల్‌ ఉల్లంఘించినట్లు ఫెడరల్‌ కోర్టు నిర్ధారించింది. పేటెంట్‌ హక్కుల ఉల్లంఘనలో భాగంగా ఆపిల్‌ కంపెనీ భారీ మొత్తాన్ని అప్టిస్‌ కంపెనీకు ముట్టజెప్పనుంది. ప్రముఖ బిగ్‌ టెక్‌ కంపెనీలు 2015 నుంచి పేటెంట్‌ హక్కులను కాలారాస్తన్నట్లు ఒక నివేదికలో తెలిపింది. ఆయా దిగ్గజ టెక్‌ కంపెనీలు పేటెంట్‌ హక్కుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ కేసులను ఓడిపోతున్నారు. 

మరిన్ని వార్తలు