Bigg Boss: కాసుల వర్షం కురిపిస్తున్న బిగ్‌బాస్‌ షో...!

8 Sep, 2021 16:35 IST|Sakshi

ముంబై: బిగ్‌బాస్‌ ఒక రియల్టీ గేమ్‌ షో. దేశ వ్యాప్తంగా బిగ్‌బాస్‌ టెలివిజన్‌ రంగంలో కొత్త రికార్డులను నమోదు చేసింది. బిగ్‌ బాస్‌ షోను తొలిసారిగా హిందీ భాషలో స్ట్రీమ్‌ అవ్వగా...హిందీలో బిగ్‌బాస్‌ విజయవంతంకావడంతో నిర్వాహకులు ఇతర భాషలో కూడా వచ్చేవిధంగా పలు చర్యలను తీసుకున్నారు. బిగ్‌బాస్‌ దేశవ్యాప్తంగా హిందీతో పాటుగా మిగతా ఆరు భాషలో  ఈ షో విజయవంతంగా నడుస్తోంది. బిగ్‌బాస్‌ను హిందీ, కన్నడ, బంగ్లా, తెలుగు, మరాఠీ, మలయాళం, తమిళ భాషల్లో ఎండెమోల్‌ షైన్‌ ఇండియా నిర్మిస్తుంది.
చదవండి: Bigg Boss: బాస్‌లకే బాస్‌ అసలైన బిగ్‌బాస్‌ ఇతనే

తాజాగా బిగ్‌బాస్‌ ఓటీటీ షోను ప్రముఖ మీడియా సంస్థ వయాకామ్‌ 18 వూట్‌ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమ్‌ చేస్తుంది. గత ఏడాది కలర్స్‌ ఛానల్‌లో బిగ్‌బాస్‌ -14 స్ట్రీమ్‌  అయినప్పుడు సుమారు 3.9 బిలియన్ల నిమిషాలపాటు ఆడియన్స్‌ చూశారు. ప్రస్తుతం వూట్‌లో వస్తున్న ఈ షోకు ఆడియన్స్‌ మంచి ఆదరణ వస్తోంది. ప్రతి వారం 1.5-2 మిలియన్ల యూజర్లు బిగ్‌బాస్‌ ఓటీటీ షోను చూడడానికి వస్తోన్నట్లు తెలుస్తోంది.  యూజర్లలో ఎక్కువగా 15-30 వయసు​ ఉన్న వారు ఉన్నారు. వయాకామ్‌ 18 మీడియా చేసిన ఓటీటీ ప్రయోగం విజయవంతమైనట్లు కంపెనీ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గౌరవ్‌ రక్షిత్‌ పేర్కొన్నారు. వూట్‌ ను వాడే యూజర్లు ఏకంగా రెట్టింపుఐన్నట్లు వెల్లడించారు. 

ప్రముఖ ఓటీటీలకు పోటీగా...
బిగ్‌బాస్‌ ఓటీటీ రాకతో వూట్‌ దశ మారింది. భారత్‌లో ముఖ్యంగా అమెజాన్‌ ప్రైమ్‌వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఎక్కువగా ప్రజాదరణను పొందాయి. బిగ్‌బాస్‌ ఓటీటీ ను వూట్‌లో ప్రసారం చేయడంతో ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంకు వ్యూయర్‌షిప్‌ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ ఓటీటీ షోను వూట్‌ యాడ్స్‌ను అందిస్తూ ఉచితంగా చూసే వీలు కల్పించింది. బిగ్‌బాస్‌ ఓటీటీ షో లో స్విగ్గి, కాయిన్‌డీసీఎక్స్‌ వంటి కంపెనీలు యాడ్స్‌ను షోలో ప్రదర్శించడానికి ముందుకువచ్చాయి.

బిగ్‌బాస్‌ ఓటీటీ షో వూట్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. అడ్వటైజింగ్‌ నిపుణుల ప్రకారం బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రకటనల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది.   బిగ్‌బాస్‌ ఓటీటీ గత నెల ఆగస్టు 8న ప్రారంభమవ్వగా...షోకు వ్యాఖ్యాతగా నిర్మాత కరణ్‌ జోహర్‌ వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్‌-15 షోకు కర్టన్‌రైజర్‌గా బిగ్‌బాస్‌ ఓటీటీ షో ఆరు వారాలపాటు వూట్‌లో స్ట్రీమ్‌ కానుంది.  
చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌..!

>
మరిన్ని వార్తలు