దిగ్గజాలకు చిన్న సంస్థల సవాల్‌

18 Nov, 2023 00:56 IST|Sakshi

ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితి

ద్రవ్యోల్బణం తగ్గడంతో పోటీలోకి చిన్న కంపెనీలు

ధరలు తగ్గించి విక్రయాలు పెంచుకునే వ్యూహం

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీలకు చిన్న సంస్థలు సవాళ్లు విసురుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో చిన్న బ్రాండ్లు మళ్లీ బలంగా పుంజుకుంటున్నాయి. పెద్ద సంస్థలకు బలమైన పోటీనిస్తున్నాయి. మార్కెట్లో వాటాను పెంచుకంటూ, పెద్ద సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించక తప్పని పరిస్థితులను కలి్పస్తున్నాయి. సబ్బులు, టీ, డిటర్జెంట్, బిస్కట్ల విభాగంలో ఈ పరిస్థితి ఉంది.

హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌), గోద్రేజ్‌ కన్జ్యూమర్, మారికో, బ్రిటానియా, టాటా కన్జ్యూమర్‌ సంస్థలు సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాల విడుదల సందర్భంగా.. చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీ కారణంగా ఉత్పత్తుల ధరలను సవరించాల్చి వచి్చనట్టు పేర్కొనడం గమనార్హం. ‘‘ద్రవ్యోల్బణం గరిష్టాల్లో ఉన్నప్పుడు చిన్న సంస్థలకు ఉత్పత్తుల తయారీపై అధిక వ్యయం అవుతుంది.

దీంతో అవి పెద్ద సంస్థలకు ధరల పరంగా గట్టి పోటీనిచ్చే పరిస్థితి ఉండదు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు మార్జిన్లు ఎక్కువగా ఉండడంతో అవి అధిక డిస్కౌంట్లు ఇవ్వగలవు’’అని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ వైస్‌ చైర్మన్, ఎండీ వరుణ్‌ బెర్రీ ఇన్వెస్టర్ల కాల్‌లో పేర్కొన్నారు. ఒక్కసారి కమోడిటీల ధరలు తగ్గడం మొదలైతే, వాటి మార్జిన్లు పెరుగుతాయని, దీంతో అధిక డిస్కౌంట్లు ఇవ్వడం మొదలు పెడతాయన్నారు.  

కొన్ని విభాగాల్లో అధిక పోటీ
‘‘ఒకవైపు బలమైన బ్రాండ్లతో పెద్ద సంస్థలతో పోటీ పడాలి. ధరల యుద్ధంతో అవి మార్కెట్‌ వాటాను చిన్న సంస్థలకు కోల్పోవాల్సి వస్తోంది. మేము ఈ చట్రంలో ఇరుక్కోవాలని అనుకోవడం లేదు. రెండింటి మధ్య సమతుల్యం ఉందనుకున్న విభాగంలోనే ముందుకు వెళతాం’’అని టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ పేర్కొనడం గమనార్హం.

టీ పొడి మార్కెట్లో ప్రాంతీయంగా చిన్న సంస్థల నుంచి పోటీ ఉన్నట్టు తెలిపింది. ఇతర విభాగాల మాదిరిగా కాకుండా, టీ మార్కెట్లో అన్‌ బ్రాండెడ్‌ కారణంగా చిన్న సంస్థలు ఎప్పుడూ ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో దీని కారణంగా కొంత వ్యాపారం కోల్పోవాల్సి వస్తుందంటూ.. తమ ప్రీమియం ఉత్పత్తుల వాటా పెరుగుతున్నందున ఇది తమపై ఏమంత ప్రభావం చూపబోదని వాటాదారులకు టాటా కన్జ్యూమర్‌ వివరించింది.

ధరలు తగ్గింపు..  
చిన్న సంస్థలు చాలా చురుగ్గా ఉన్నాయని, వాటి కారణంగా మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొన్నట్టు మారికో ఎండీ, సీఈవో సౌగత గుప్తా తెలిపారు. ప్రస్తుత పరిణామాల్లో కొన్ని విభాగాల చిన్న సంస్థల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ధరలు తగ్గించి, వినియోగదారులకు విలువను చేకూర్చే చర్యలు అమ్మకాల వృద్ధికి వచ్చే కొన్ని త్రైమాసికాల్లో దోహదపడతాయి’8అని సౌగత గుప్తా తెలిపారు.  

మరిన్ని వార్తలు