ఆ కంపెనీకి భారీగా నిధులను అందిస్తోన్న బిల్‌గేట్స్‌, జెఫ్‌బెజోస్‌..!

11 Sep, 2021 21:06 IST|Sakshi

వాషింగ్టన్‌:  ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య గ్లోబల్‌ వార్మింగ్‌..! ఎంత త్వరగా వీలైతే  అంతా తక్కువ సమయంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం కోసం పలు కంపెనీలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. శిలాజ ఇంధనాల స్థానంలో విద్యుత్‌ శక్తిని ఉపయోగించి వాహనాల తయారీ కోసం ఇప్పటికే పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి.

చదవండి: Elon Musk SpaceX: కక్ష్యలో 3 రోజుల ప్రయాణానికి సర్వం సిద్ధం


ఎలన్‌మస్క్‌కు చెందిన టెస్లా ఒక అడుగు ముందేకేసి ఎలక్ట్రిక్‌ కార్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. టెస్లా కార్లు ఒక్కసారి ఛార్జ్‌చేస్తే ఆరు వందల కిలోమీటర్లమేర ప్రయాణిస్తాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల రేంజ్‌ అనేది ఆయా వాహనాల మెటల్‌ బాడీపై ఆధారపడి ఉంటుంది.   అత్యంత మన్నికైన, తేలికైన,  శక్తివంతమైన, మెటల్‌ బాడీల తయారుకోసం పలు శాస్త్రవేత్తలు పరిశోధనలను చేపట్టారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వాడే లోహలకోసం చేపట్టే పరిశోధనలకు మరింత ఊతం ఇచ్చేందుకు గాను ప్రపంచ బిలియనీర్లు అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ కోబోల్డ్‌ అనే మినరల్‌  ఎక్స్‌ప్లోరేషన్‌ స్టార్టప్‌లో భారీగా నిధులను ఇన్వెస్ట్‌చేసినట్లు తెలుస్తోంది. కోబోల్ట్‌ స్టార్టప్‌, బీహెచ్‌పీ కంపెనీ భాగస్వామ్యంతో ఈవీ వాహనాల్లో వాడే లోహలను వెతకడం కోసం పరిశోధనలను చేపట్టనున్నారు. వీరు అందించే లోహలు ప్రాథమికంగా టెస్లా కార్ల తయారీకి ఉపయోగపడనుంది. 

కోబోల్డ్ మెటల్స్ , బిహెచ్‌పి కలిసి ఆస్ట్రేలియాలోని లిథియం, నికెల్, కోబాల్ట్,  రాగి కోసం శోధిస్తాయని కోబోల్డ్ సిఇఒ కర్ట్ హౌస్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. టెస్లా కార్ల  బ్యాటరీలో వాడే నికెల్‌ అందించడంకోసం టెస్లాతో బీహెచ్‌పీ కంపెనీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కృత్రిమ మేథస్సు ఏఐ టెక్నాలజీనుపయోగించి ఈవీ వాహనాల లోహలకోసం కోబోల్డ్‌ మెటల్స్‌ అన్వేషణ చేపట్టనున్నాయి. ఈ కంపెనీల్లో ఎనర్జీ వెంచర్స్‌ ద్వారా మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌,  అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌తో పాటుగా బ్లూమ్‌బర్గ్‌ వ్యవస్థాపకుడు మైఖేల్‌ బ్లూమ్‌బర్గ్‌ పెట్టుబడిపెట్టినట్లు తెలుస్తోంది. వీరు ఎంతమేర పెట్టుబడిపెట్టారనే విషయంపై కోబోల్ట్‌ స్పందించలేదు. ఈవీ వాహనాల లోహల పరిశోధనలకోసం 14 మిలియన్‌ డాలర్లను ఖర్చుచేయనుంది.   

చదవండి: బడాబడా కంపెనీలు భారత్‌ వీడిపోవడానికి కారణం ఇదేనా..! 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు