బిల్‌గేట్స్‌కు తాతగా ప్రమోషన్‌

6 Mar, 2023 08:54 IST|Sakshi

మైక్రోసాఫ్ట్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్ తాతయ్యారు. అవును.. ఆయ‌న కూతురు జెన్నిఫర్ కాథరిన్ గేట్స్, నయెల్ నాసర్ దంపతులు పండంటి మొద‌టి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ విష‌యాన్ని ధ్రువీక‌రిస్తూ బేబి ఫేస్‌ను కవర్‌ చేస్తూ తీసిన పాదాల ఫొటోల్ని జెన్నిఫర్ గేట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఆ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. చాలామంది జెన్నిఫ‌ర్‌కు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు.

A post shared by Jennifer Gates (@jenniferkgates)


‘సెండింగ్‌ లవ్‌ ఫ్రమ్‌ అవర్‌ హెల్తీ లిటిల్‌ ఫ్యామిలీ’ అనే క్యాప్షన్‌ జోడిస్తూ..పోస్ట్‌చేసిన ఫోటోలపై బిల్‌ గేట్స్‌ స్పందించారు. జెన్నీఫర్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.  

 వివాహ బంధంతో ఒక్కటైన ప్రేమ జంట
2021 అక్టోబ‌ర్‌లో న‌యెల్ నాజ‌ర్‌ను జెన్నిఫ‌ర్ గేట్స్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం ప్రేమించుకున్న వీరిద్దరి వివాహానికి బిల్‌గేట్స్‌ దంపతులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇక బిల్‌ గేట్స్‌ అల్లుడు నాసర్ పేరెంట్స్ ఈజిప్ట్ నుంచి వచ్చి యూఎస్ లో స్థిరపడగా, నాసర్‌ చికాగోలో జన్మించాడు. అతనికి ఈజిప్టు పౌరసత్వం ఉంది. హార్స్ రేస్ పోటీల్లో ఈజిప్ట్ తరఫున 2020 ఒలింపిక్స్‌లో కూడా ఆడారు. 

చదవండి👉 ఆయన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు