మహీంద్రా ఇ-రిక్షా నడిపిన బిల్‌ గేట్స్‌ వీడియో వైరల్‌, ఆనంద్‌ మహీంద్ర స్పందన

6 Mar, 2023 16:08 IST|Sakshi

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ భారత పర్యటనలో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తనకెదురైన కొత్త కొత్త అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి వంట చేస్తున్న వీడియో షేర్‌ చేయగా అది ఇంటర్నెట్‌లో వైరల్‌ అయింది. అలాగే తన క్లాస్‌ మేట్, వ్యాపారవేత్త ఆనంద్మహీంద్రాతో భేటీకావడం ప్రముఖంగా నిలిచింది. తాజాగా మహీంద్రా ట్రియో ఆల్-ఎలక్ట్రిక్ రిక్షాను నడుపుతున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. గ్రీన్ ఇన్నోవేషన్స్‌కు భారీ మద్దతిస్తే  బిట్‌ గేట్స్‌  మహీంద్ర ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌పై ప్రశంసలు కురిపించారు. ‘బాబు సంజో ఇషారే’ నేపథ్య సంగీతంతో కూడిన పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందరినీ ఆకర్షిస్తోంది.

మహీంద్రా వంటి కంపెనీలు రవాణా పరిశ్రమలో ఇ-రిక్షాలతో డీకార్బనైజేషన్‌కి దోహదం చేయడం స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు. "గేట్స్ నోట్స్" అంటూ బిల్ గేట్స్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్  చేసిన వీడియోలో ఇ-రిక్షాను ఆన్ చేసి,131కిమీ (సుమారు 81 మైళ్లు) వరకు ప్రయాణించే ఎలక్ట్రిక్ రిక్షాను నడిపా. నలుగురిని మోసుకెళ్లవచ్చు అంటూ తన స్పెషల్‌ డ్రైవింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. వ్యవసాయం నుండి రవాణా వరకు  కార్బన్ ఉద్గారాలు లేని ప్రపంచంకోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని  ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చారు.  కోవిడ్-19 తర్వాత బిల్ గేట్స్  ఇండియాకు రావడం ఇదే మొదటిది.

A post shared by Bill Gates (@thisisbillgates)

కాగా 2021 చివరలో లాంచ్‌ చేసిస మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ధర రూ. 2.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). 7.37 kWh సామర్థ్యంతో 48V లిథియం-అయాన్ బ్యాటరీ  పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటల 50 నిమిషాలు పడుతుంది. దీనికి గరిష్ట వేగం గంటకు 50కిమీ . ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే దాదాపు 80కిలోమీటర్లు ప్రయాణించగలదు. రియర్‌, అండ్‌  ఫ్రంట్‌  హైడ్రాలిక్ బ్రేక్స్‌తోపాటు,  అలాగే  పార్కింగ్ కోసం మెకానికల్ లివర్ బ్రేక్ ఆప్షన్ కూడా ఉంది. 

 ఆనంద్‌ మహీంద్ర స్పందన

మరోవైపు  బిల్‌ గేట్స్‌ పోస్ట్‌పై ఆనంద్‌మహీంద్ర కూడా స్పందించారు. "చల్తీ కా నామ్ బిల్ గేట్స్ కీ గాడి"  అంటూ మహీంద్ర  ట్రియోని చూడటానికి  బిల్‌ గేట్స్‌కి సమయం దొరికినందుకు చాలా సంతోషం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్‌ చేశారు. అలాగే మీ నెక్ట్స్‌ ఎజెండాలో నాతోపాటు, మీరు సచిన్‌ తెందూల్కర్‌, ముగ్గురి మధ్య 3- వీలర్ ఈవీ డ్రాగ్ రేస్ ఉండేలా చూడండి అంటూ  ఆయన పేర్కొనడం విశేషం.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు