మిస్టరీ అకౌంట్‌.. అదృష్టం అంటే ఇదే!

25 May, 2021 13:45 IST|Sakshi

వెబ్‌డెస్క్‌: రెండువారాల క్రితం క్రిప్టోకరెన్సీ డోజ్‌‌కాయిన్‌‌ విలువ అమాంతం పడిపోయింది. చైనా క్రిప్టోకరెన్సీని బ్యాన్‌ చేయడంతోనే ఇది జరిగింది. అయితే ఈ క్రాష్‌ను కూడా తట్టుకుని ఈ ఏడాది ప్రారంభ నికర విలువ కంటే మెరుగ్గానే కొనసాగుతోంది డోజ్‌కాయిన్‌. టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ తరచూ డోజ్‌కాయిన్‌ను సపోర్ట్‌ చేస్తూ ట్వీట్లు చేస్తుండడమే ఇందుకు ఒక కారణం. అయితే మిస్టరీ అకౌంట్‌ ఒకటి రికార్డు స్థాయిలో విలువ చేసే డోజ్‌కాయిన్లను కలిగి ఉండడం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

డోజ్‌కాయిన్‌ ‘వేల్‌’ అకౌంట్‌ ఒకటి తన ఖాతాలో వేల కోట్లు చేసే ఈ మీమ్‌ కరెన్సీని కలిగినట్లు ఉన్నట్లు బయటపడింది. దగ్గరదగ్గర 12 బిలియన్ల డాలర్లు విలువ చేసే కాయిన్స్‌ (మన కరెన్సీలో 8, 752 కోట్ల రూపాయల విలువైన) ఆ అకౌంట్‌ పేరిట ఉన్నాయి. ఇటీవల క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో వచ్చిన కుదుపులను తట్టుకుని మరీ ఈ అకౌంట్‌ అంత విలువైన కరెన్సీని కలిగి ఉండడం విశేషం. మరోవైపు డిజిటల్‌ కరెన్సీ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా ట్రేడ్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

వహ్‌.. మేజర్‌ షేర్‌
బిట్‌ఇన్ఫోఛార్ట్స్‌ ప్రకారం.. ది డోజ్‌ కాయిన్‌ వేల్‌ అకౌంట్‌ DH5yaieqoZN36fDVciNyRueRGvGLR3mr7L అడ్రస్‌ మీద 2019, ఫిబ్రవరి 6న ఫస్ట్‌ కొనుగోలు చేసింది. ఆ టైంలో కాయిన్‌ విలువ మన కరెన్సీపరంగా పదమూడు పైసలుగా ఉంది. అయితే ప్రస్తుతం ఆ ఇన్వెస్టర్‌ దగ్గర 3,671 కోట్ల డోజ్‌కాయిన్స్‌ ఉన్నాయి. వాటి మొత్తం విలువ 12 బిలియన్ల డాలర్లుగా తేలింది. ఈ విలువ ఇప్పుడున్న క్రిప్టోకరెన్సీలో 28 శాతంగా ఉండడం విశేషం. అయితే రెండువారాల క్రితం క్రాష్‌ కాకముందు ఈ అకౌంట్‌ క్రిప్టోకరెన్సీ విలువ 22 బిలియన్ల డాలర్లు(16వేలకోట్ల రూపాయలకుపైనే) ఉండిందట. ప్రస్తుతం కాయిన్‌మార్కెట్‌కాప్‌లో డోజ్‌కాయిన్‌ విలువ డాలర్‌లో మూడో వంతు (సుమారు23 రూపాయలుగా) ఉంది. అయితే ఈ మిస్టరీ అకౌంట్‌ బహుశా ఎలన్‌ మస్క్‌దే అయ్యి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జోక్‌గా మొదలై..
డోజ్‌కాయిన్‌ మీద ఫోకస్‌ ఎక్కువ కావడంతో.. ఈ ఏడాది మొదటి నుంచి ఆ కాయిన్స్‌కు గడ్డుకాలం నడుస్తోంది. షిబ ఇను అనే కుక్క బొమ్మతో డోజ్‌కాయిన్‌ 2013లో లాంఛ్‌ అయ్యింది. బిల్లీ మర్కస్‌, జాక్సన్‌ పామర్‌ అనే ఇద్దరు టెక్కీలు వీటిని స్టార్ట్‌ చేశారు. ట్రెడిషనల్‌ బ్యాంకింగ్‌ ఫీజును ఎగతాళి చేస్తూ జోక్‌గా ప్రారంభించిన డోజ్‌కాయిన్‌ ప్రయత్నం.. ఇప్పుడు లక్షల కోట్ల బిజినెస్‌కు చేరుకుంది. ఇక బ్లాక్‌యెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు పనిచేస్తాయి. సతోషి నకమోటో అనే వ్యక్తి 2008 అక్టోబర్‌లో బిట్ కాయిన్‌ని కనుగొన్నట్లు చెప్తుంటారు.

మరిన్ని వార్తలు