Elon Musk Twitter Deal: ఇబ్బందుల్లో ట్విటర్‌ డీల్‌, ఇంతకీ ఉన్నట్టా? లేనట్టా? 

8 Jul, 2022 17:01 IST|Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ డీల్‌కు సంబంధించి  టెస్లా సీఈవో ఈలాన్‌ మస్క్‌ ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.  టెక్ బిలియనీర్ మస్క్  44 బిలియన్ డాలర్లకు కొనుగోలు డీల్‌ తీవ్ర ఇబ్బందుల్లో పడిందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ట్విట్టర్ దాని స్పామ్ ఖాతా డేటా, బాట్‌లను  ఎదుర్కొనే టెక్నాలజీ  బాగానే ఉన్నాయనీ,  రోజుకు 10 లక్షల నకిలీ ఖాతాలను బ్లాక్‌ చేశానని  ట్విటర​ ప్రకటించిన తరువాత ఇలాంటి వార్తలు రావడం గమనార్హం.

ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం ట్విటర్‌ కొనుగోలుకు సంబంధించిన చర్చలు మస్క్‌ నిలిపివేశారు. దీంతో ఈ డీల్‌ ఇప్పట్లో పూర్తవుతుందా అని సందేహాలు నెల కొన్నాయి. లారీ ఎల్లిసన్, వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ఆండ్రీసెన్ హోరోవిట్జ్, ఫిడిలిటీ, క్రిప్టోఎక్స్ఛేంజ్ బినాన్స్, స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్ ఖతార్‌తో కలిసి సంయుక్తంగా ట్విటర్‌ డీల్‌ను చేసుకోవాలని మస్క్‌ ప్రయత్నించారు. కాగా ట్విటర్‌లో నకిలీ ఖాతాల విషయంలో ట్విటర్‌ డేటాతో విబేధిస్తున్న మస్క్‌  తాత్కాలికంగా ఈ డీల్‌ను నిలిపిస్తున్నట్టు గతంలో  ప్రకటించిన సంగతి  తెలిసిందే. 

మరిన్ని వార్తలు