బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ విదేశీ నిధులపై కన్ను: భారీ కసరత్తు

10 Oct, 2022 12:15 IST|Sakshi

సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ  గ్రూపు  పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. క్లీన్ ఎనర్జీ, పోర్ట్‌లు, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్ వ్యాపార విస్తరణలో ఇప్పటికే దూకుడుగా ఉన్న సంస్థ తన విస్తరణ ప్రణాళికపై మరింత వేగం పెంచింది. దాదాపు 10 బిలియన్ల డాలర్ల మేర విదేశీ నిధులు సమకీరించనుంది.  

ముఖ్యంగా సింగపూర్ పెట్టుబడి సంస్థలైన టెమాసెక్ , సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీతోతో సహా పలు పెట్టుబడిదారులతో ముందస్తు చర్చలు జరుపుతున్నట్లు మింట్ వార్తాపత్రిక సోమవారం నివేదించింది. అదానీ గ్రూపుకుటుంబ సభ్యులు, టాప్ గ్రూప్ పలువురు ఎగ్జిక్యూటివ్‌లు ఈ పెట్టుబడిదారులతో చర్చలు జరిపినట్టు  నివేదించింది.  పలు దఫాలుగా గ్రూపు సంస్థలు, ప్రమోటర్ గ్రూప్-అనుబంధ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా భారీ ఎత్తున నిధులను సమీకరించనుంది. అయితే జీఐసీ అదానీ గ్రూప్  ఈ వార్తలపై స్పందించలేదు. అలాగే మార్కెట్ ఊహాగానాలపై  వ్యాఖ్యానించేందుకు టెమాసెక్  తిరస్కరించింది.

ఓడరేవులు, విమానాశ్రయాలు, గ్రీన్‌ ఎనర్జీ, సిమెంట్‌, డాటా సెంటర్లు తదితర వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూప్‌ రాబోయే దశాబ్దంలో 100 బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టనున్నామని, ఇందులో ఎక్కువ భాగం న్యూ ఎనర్జీ, డాటా సెంటర్ల వంటి డిజిటల్‌ విభాగంలో ఈ పెట్టుబడులుంటాయిన అదానీ గ్రూపు ఛైర్మన్ అదానీ గత నెలలో  ప్రకటించారు. వచ్చే దశాబ్ద కాలంలో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను  పెట్టనున్నామని  ఇటీవలి ఫోర్బ్స్‌ గ్లోబల్‌ సీఈవోల సదస్సులో గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ తెలిపిన సంగతి తెలిసిందే.  కాగా 143 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు అదానీ. 

మరిన్ని వార్తలు