Bitcoin ATMs: అనూహ్య నిర్ణయం! అక్కడ ఏటీఎంలు అన్నీ బంద్‌..! కారణం ఇదే..!

13 Mar, 2022 10:48 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్రిప్టోకరెన్సీలు బిట్‌కాయిన్‌, ఈథిరియం, డోజీకాయిన్‌ విలువ గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయా క్రిప్టోకరెన్సీలు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ కూడా అమాంతం పెరిగాయి. ఇదిలా ఉండగా  బిట్‌కాయిన్‌ క్రిప్టో కరెన్సీ ఏటీఎంలపై యుకే ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. 

చట్ట విరుద్దమైనవే..!
యూకేలోని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు ఆ దేశ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్‌సీఏ) గట్టి షాక్‌ను ఇచ్చింది. క్రిప్టో ఎక్సేఛేంజ్స్‌పై కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. క్రిప్టో ఏటీఎం ఆపరేటర్లు వారి మెషీన్లు క్లోజ్ చేయాలని ఆదేశించింది. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజ్ సర్వీసులు అందించే క్రిప్టో కరెన్సీ ఏటీఎంలు అన్నీ ఎఫ్‌సీఏ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రిప్టో ఏటీఎంలు అన్నీ యూకే మనీ ల్యాండరింగ్ నిబంధనలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుంది. చట్టవిరుద్దంగా క్రిప్టో కరెన్సీ ఏటీఎం సర్వీసులు అందిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలను జారీ చేసింది.

క్రిప్టో లావాదేవీలు సులువు..!
యుకేతో పాటుగా పలు దేశాల్లో ఇన్వెస్టర్లకు సులవుగా క్రిప్టోలను కొనుగోలు లేదా సేల్‌ చేసేందుకుగాను క్రిప్టో ఎటీఎంలను ఎక్సేఛేంజ్స్‌ ఏర్పాటుచేశాయి. ఇవి సాధారణ ఎటీఎం వలె కన్పిస్తాయి. ప్రజలు తమ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి బిట్‌కాయిన్ వంటి క్రిప్టో-కరెన్సీ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.కాగా యుకేలోని క్రిప్టో-కరెన్సీ సేవలను అందించే ఏ కంపెనీకి క్రిప్టో-ATMని ఆపరేట్ చేయడానికి లైసెన్స్ లేదు. క్రిప్టో ఏటీఎం డైరెక్టరీ కాయిన్‌ ఎటీఎం రాడార్‌ ప్రకారం..యుకేలో సుమారుగా 81 ఫంక్షనల్‌ క్రిప్టో ఎటీఎంలు ఉన్నాయి.ఎఫ్‌సీఏ నిర్ణయంతో ఆ దేశ క్రిప్టో ఇన్వెస్టర్లకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టనుంది. 

చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్‌ నిర్ణయం..! ​కారణం అదేనట..?

మరిన్ని వార్తలు