Bitcoin: మరో రికార్డును బిట్‌కాయిన్‌ నెలకొల్పనుందా...!

12 Oct, 2021 16:11 IST|Sakshi

Bitcoin Gets Closer To 60000 Dollors: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అధిక ద్రవ్యోల్భణ పరిస్థితులు...క్రిప్టోకరెన్సీపై  చైనా తీసుకున్న నిర్ణయాలు పలు క్రిప్టోకరెన్సీలు ఒక్కసారిగా పతనమైన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఎల్‌ సాల్వాడర్‌ బిట్‌కాయిన్‌ మైనింగ్‌పై తీసుకున్న నిర్ణయాలు తిరిగి బిట్‌కాయిన్‌ పుంజుకునేందుకు దోహదం చేశాయి. చివరి వారంలో బిట్‌కాయిన్‌ ఏకంగా 30 శాతం మేర పురోగతిని సాధించింది. దీంతో ఐదెన్నెల్ల గరిష్టానికి బిట్‌కాయిన్‌ విలువ చేరుకుంది.

60 వేల డాలర్లకు చేరువలో...!
బిట్‌కాయిన్‌ విలువ  మరో సరికొత్త రికార్డులకు దగ్గరలోనే ఉంది. బిట్‌కాయిన్‌ విలువ 60 వేల డాలర్లకు చేరనుంది. మే తర్వాత మొదటిసారి బిట్‌కాయిన్‌ 57 వేల డాలర్లు(రూ. 42 లక్షలు) దాటింది. బినాన్స్‌, కాయిన్‌మర్కెట్‌ క్యాప్‌ వంటి ఎక్సేచేంజ్‌లో 57, 490 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇండియన్‌ ఎక్సేచేంజ్‌ కాయిన్స్‌ స్విచ్‌ కుబేర్‌లో బిట్‌ కాయిన్‌ విలువ 59 వేల డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో క్రిప్టోకరెన్సీ ఆల్‌టైమ్‌ హై 65 వేల డాలర్లను తాకింది.

బిట్‌కాయిన్‌ ర్యాలీ ఇదే విధంగా కొనసాగితే మరికొన్ని రోజుల్లో కొత్త రికార్డును తాకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈథర్‌ వంటి క్రిప్టోకరెన్సీ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఈథిరియం విలువ 3,740 వద్ద ట్రేడవుతో​ంది. సోమవారం రోజున సుమారు 1.29 శాతం మేర లాభపడింది. అయితే ఈథర్‌లో స్థిరమైన ర్యాలీ కన్పించడంలేదు. మిగిలిన ఇతర అల్ట్‌కాయిన్స్‌ కార్డానో, టెథర్‌, రిపుల్‌, పోల్కాడోట్‌ అన్నీ సగటున 2-3 శాతం మేర తగ్గుతూ కన్పించాయి. 
చదవండి: చైనాలో ఆంక్షలు..! వారికి ఆశాదీపంలా ఎయిరిండియా-టాటా డీల్‌..!

>
మరిన్ని వార్తలు