రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న బిట్‌కాయిన్

17 Mar, 2021 14:27 IST|Sakshi

ఒకవైపు భారత్‌లో క్రిప్టో కరెన్సీలు చట్టబద్ధమవుతాయా లేదా అన్న దానిపై సందిగ్ధం కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు అంతర్జాతీయంగా బిట్‌ కాయిన్‌ రేటు రోజు రోజుకూ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తొలి సారిగా 61,000 డాలర్ల స్థాయిని(సుమారు రూ. 43,92,000) తాకింది. కోవిడ్‌-19 ఉపశమన చర్యల కోసం అమెరికా ప్రభుత్వం 1.9 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన దరిమిలా ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న ఆశావహ అంచనాలు .. బిట్‌కాయిన్‌ వంటి కరెన్సీలకు ఊతమిస్తున్నాయి.  

గత ఏడాది వ్యవధిలో బిట్‌ కాయిన్‌ విలువ 1,000 శాతం ఎగిసింది. గతేడాది నాలుగో త్రైమాసికం ఆఖరు నాటికి 29,000 డాలర్ల స్థాయిలో ఉన్న విలువ ఆ తర్వాత ఏకంగా 40,000 డాలర్లకు పెరిగింది. మరికొద్ది రోజుల్లోనే మరో కొత్త గరిష్టం 61,000 డాలర్లకు ఎగిసింది. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ తదితర దిగ్గజ ఇన్వెస్టర్ల ఊతంతో ఈ ఏడాది ఆఖరు నాటికల్లా బిట్‌కాయిన్‌ విలువ ఏకంగా 1,00,000 డాలర్లకు కూడా ఎగిసే అవకాశాలను తోసిపుచ్చలేమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

చదవండి:

క్రిప్టో కరెన్సీల నిషేధానికి కేంద్రం కసరత్తు!

మరిన్ని వార్తలు