GainBitcoin Scam: భారత దేశ చరిత్రలో 90వేల కోట్ల బిట్‌ కాయిన్‌ స్కాం..చేసింది ఎవరంటే!

18 Jun, 2022 16:21 IST|Sakshi

ఈ ఏడాది మార్చి నెలలో భారీ బిట్‌ కాయిన్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కాం వెనుక మాస్టర్‌ మైండ్‌ అమిత్‌ భరద్వాజ్‌పై కోర్ట్‌లో కేసు నడుస్తుండగా.. తాజాగా ఆ మొత్తం కుంభ కోణం విలువ సుమారు రూ.90,500 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. 

అమిత్‌ భరద్వాజ్‌ అనే నిందితుడు పోంజి స్కాం చేశాడు.ఇక, బిజినెస్‌ వాడుక భాషలో పూంజి స్కాం అంటే..ఉదాహరణకు..నిందితుడు లక్షమందిని మోసం చేయాలని అనుకుంటే..ఆ డిజిట్‌కు రీచ్‌ అయ్యేందుకు ప్లాన్‌ చేస్తాడు.ఇందుకోసం తన మాట విని బిట్‌ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టాలని, అలా చేస్తే పెట్టిన మొత్తాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇస్తాడు. ఆ మాటలు నమ్మిన మదుపర్లు బిట్‌ కాయిన్‌లపై భారీగా ఇన్వెస్ట్‌ చేస్తారు. చెప్పినట్లుగానే అమాయకులైన ఇన్వెస్టర్లకు మొదట్లో లాభాలు చూపిస్తారు. ఆ లాభాలతో నిందితులకు పబ్లిసిటీ పెరుగుతుంది. దీంతో అనతి కాలంలో స్కాం టార్గెట్‌ను రీచ్‌ అవ్వొచ్చు. అలా టార్గెట్‌ రీచ్‌ అయితే ఇన్వెస్టర్లకు ఆదాయం చూపించడం మానేస్తారు.

ప్రతినెలా డబ్బులే డబ్బులు
సేమ్‌ ఇలాగే పైన అమిత్‌ భరద్వాజ్‌ కుంభకోణం విషయంలో జరిగింది. భారీ ఎత్తున మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌తో 18 నెలల పాటు బిట్కాయిన్‌లపై పెట్టుబడి పెడితే ప్రతినెలా డిపాజిట్లలో 10శాతం ఆదాయం చూపిస్తానని హామీ ఇచ్చాడు. ఆ కాలంలో తమ పెట్టుబడులు పెరుగుతాయని హామీ ఇస్తూ బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను కోరారు. ఇలా అమిత్‌ పెట్టు బడిదారుల్ని భారీ ఎత్తున మోసం చేసి, చివరకు బిచాణా ఎత్తేశాడు. దీంతో ప్రతి నెల ఒక్కసారి వచ్చి పడుతున్న ఆదాయం కనుమరుగు కావడంతో పెట్టుబడిదారులకు అనుమానం రావడం, కేసు ఈడీ అధికారుల చేతుల్లోకి వెళ్లడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 

కేసు విచారణలో ఉండగా..ఈడీ బిట్‌కాయిన్‌ కుంభకోణానికి పాల్పడిన నిందితుల క్రిప్టో వాలెట్‌కు యాక్సెస్, యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరింది. అంతేకాదు వివేక్ భరద్వాజ్, మహేందర్ భరద్వాజ్ తదితరుల సహకారంతో అమిత్ భరద్వాజ్ (ఈ ఏడాది జనవరిలో మరణించాడు) 80వేలకు పైగా  బిట్‌కాయిన్‌లు సేకరించినట్లు తాము నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. 

రూ.90వేలకోట్ల స్కాం 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ బిట్‌కాయిన్‌ స్కాంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  బాధితుల ఫిర్యాదుతో తీగలాగితే డొంక కదిలినట్లుగా అమిత్‌ చేసిన పోంజి కుంభ కోణం విలువ రూ.90వేల కోట్లకు పైగా ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పోంజీ స్కాం సూత్రధారి అమిత్ భరద్వాజ్ మదుపర‍్ల నుంచి వచ్చిన వేల కోట్లతో 385,000 నుండి 600,000 మధ్య బిట్ కాయిన్లను సేకరించారు. వాటి విలువ సుమారు వన్‌ ట్రిలియన్ కంటే ఎక్కువేనని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ స్కాంలో నిందితుడిపై 40 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.   

40ఎఫ్‌ఐఆర్‌లు
ఈడీ విచారణతో బాధితులు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోయింది. మహారాష్ట్ర, పంజాబ్, ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు బిట్‌ కాయిన్‌ కుంభ కోణంలో  బాధితులు సంపాదించిన మొత్తాన్ని కోల్పోయారు. దాదాపు ప్రస్తుత బిట్ కాయిన్ ధరను పరిగణనలోకి తీసుకుంటే? ప్రతి బిట్‌ కాయిన్‌ విలువు రూ. 23,57,250గా ఉంది.పూణే పోలీసులు 60వేల మందికి పైగా యూజర్లు, ఐడీ, ఈమెయిల్‌ అడ్రస్‌ల ఆధారాలకు అనుగుణంగా ఆ బిట్‌ కాయిన్‌ స్కాం రూ.90,500 కోట్లని అంచనా. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా..బాధితులు తమకు న్యాయం చేయాలని కోర్ట్‌లను కోరుతున్నారు.

చదవండి👉 యూట్యూబ్‌లో ‘ఎలన్‌ మస్క్‌ స్కామ్‌’, వందల కోట్లలో నష్టం!

మరిన్ని వార్తలు