రియల్‌ ఎస్టేట్‌ రంగంలో బీకే మోడీ వేల కోట్ల పెట్టుబడులు

4 Jan, 2023 13:00 IST|Sakshi

న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో దేశీయంగా రియల్టీ, వెల్‌నెస్‌ విభాగాలలో కార్యకలాపాల విస్తరణపై దృష్టిపెట్టినట్లు బీకే మోడీ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. భారీ వృద్ధి అవకాశాలున్న ఈ రెండు రంగాలలో బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 8,250 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. రియల్టీ, వెల్‌నెస్‌ విభాగాలలో కొత్త టెక్నాలజీలకు వీలున్నట్లు గ్రూప్‌ వ్యవస్థాపకులు బీకే మోడీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

ప్రతిపాదిత ప్రాజెక్టులలో విదేశీ ఇన్వెస్టర్లను భాగస్వాములు చేయనున్నట్లు తెలియజేశారు. ఒక డెవలపర్‌తో కలసి ఇప్పటికే ముంబైలో వాణిజ్య రియల్టీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ బిజినెస్‌ను మరింత విస్తరించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.  

మిక్స్‌డ్‌ ప్రాజెక్టుకు రెడీ 
ప్రయివేట్‌ స్మార్ట్‌ సిటీ ఆలోచనపై స్పందిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో మిక్స్‌డ్‌ వినియోగానికి వీలైన ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు మోడీ తెలియజేశారు. 

మరిన్ని వార్తలు