బ్లేడ్‌ ఇండియా విస్తరణ బాట

25 Nov, 2021 09:12 IST|Sakshi

5 కొత్త హెచ్‌125 హెలికాప్టర్లు జత 

ముంబై: హెలికాప్టర్‌ రవాణా సర్వీసులందించే బ్లేడ్‌ ఇండియా తాజాగా 5 కొత్త హెచ్‌125 హెలికాప్టర్లను సమకూర్చుకోనున్నట్లు వెల్లడించింది. తద్వారా దేశీయంగా పెరుగుతున్న ఆన్‌డిమాండ్‌ హెలికాప్టర్‌ సర్వీసులను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వీలుగా యూరోపియన్‌ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్‌తో జట్టు కట్టినట్లు బ్లేడ్‌ ఇండియా పేర్కొంది.

యూఎస్‌ కంపెనీ బ్లేడ్‌ యూఏఎం, హంచ్‌ వెంచర్స్‌ గ్రూప్‌ ఇండియా భాగస్వామ్య పద్ధతిలో బ్లేడ్‌ ఇండియాను ఏర్పాటు చేశాయి. బ్లేడ్‌కు దేశీ అనుబంధ సంస్థగా 2019లో ప్రారంభమైన కంపెనీ ప్రధానంగా మహారాష్ట్రలో సర్వీసులు అందిస్తోంది. వచ్చే నెల నుంచి కర్ణాటకలోనూ కార్యకలాపాలు ప్రారంభించనుంది. దేశ వ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాల్లో సర్వీసులను విస్తరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు