క్రిప్టోకరెన్సీ లావాదేవీలు ఎలా జరుగుతాయంటే..!

12 Dec, 2021 08:56 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీ ఆదరణ లభిస్తోంది.  క్రిప్టోకరెన్సీతో ఎలాంటి మోసాలకు తావు ఉండదు. ఎందుకంటే లావాదేవీలు మొత్తం పూర్తిగా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో నడుస్తాయి. అసలు ఈ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఎలా పనిచేస్తోంది, వాటి ప్రయోజనాలు ఎలా ఉంటాయనే విషయాల గురించి తెలుసుకుందాం...

బ్లాక్‌చెయిన్‌తో బోలెడు ప్రయోజనాలు...
బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో కేవలం క్రిప్టో కరెన్సీ వ్యవహారాలు మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 
1. నగదు చెల్లింపులు/వసూళ్లు
2. స్టాక్‌ ఎక్స్‌చేంజీ తరహా ఆర్థిక వ్యవహారాలు
3. ఇన్సూరెన్స్‌ సేవలు. 
5. రియల్‌ ఎస్టేట్‌. 
6. వ్యక్తిగత సమాచార భద్రత
7. ఎన్నికల ఓటింగ్‌: మీ వ్యక్తిగత సమాచారం మొత్తం బ్లాక్‌చెయిన్లలో ఉంటుంది. కాబట్టి దాని ఆధారంగా ఓటింగ్‌ నిర్వహించడం సులువు. భద్రంగా, ఎలాంటి అవ్యవహారాలకు తావు లేకుండా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ
8. ప్రభుత్వ ఫథకాల వితరణ: రేషన్‌ సరుకుల నుంచి ఇళ్లపట్టాల వరకూ ప్రతి ఒక్కటి అర్హులకు మాత్రమే దక్కేలా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ సాయపడుతుంది. మోసాలకు తావులేదు. అమలు చాలా చౌక కూడా. డిజిటల్‌ వ్యవహారాల కంటే వేగంగా లబ్ధిదారులకు సాయం అందుతుంది. 
9. ఇంటర్నెట్‌కు అనుసంధానమైన పరికరాల (ఐఓటీ) భద్రత. 


బ్లాక్‌ చెయిన్‌ పనిచేసేదిలా...

  • కొనుగోలు, కాంట్రాక్ట్‌ వంటి వ్యవహారం కోసం అభ్యర్థన
  • ఈ అభ్యర్థన నెట్‌వర్క్‌లోని కంప్యూటర్ల (నోడ్‌)కు ప్రసారమవుతుంది.
  • అభ్యర్థన తాలూకు సమాచారంతో ఒక బ్లాక్‌ ఏర్పడుతుంది. నోడ్‌ కంప్యూటర్లు ఆమోదిస్తాయి.
  • అప్పటికే ఉన్న బ్లాక్‌లకు ఈ కొత్త బ్లాక్‌ లింక్‌ ఏర్పరచుకుని నిక్షిప్తమవుతుంది. ఇలా బ్లాక్‌ల శ్రేణి ఉండటం వల్లనే దీన్ని బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ అంటారు.
  • ఇతర అంశాల సమాచారంతో కలిపి ఈ వ్యవహారానికి సంబంధించిన ఒక బ్లాక్‌ సిద్ధమవుతుంది. 
  • వ్యవహారంలో క్రిప్టోకరెన్సీ, స్మార్ట్‌కాంట్రాక్ట్, మెసేజీల్లాంటి ఏ సమాచారమైనా ఉండవచ్చు.
  • ప్రతి బ్లాక్‌లోని సమాచారం భద్రంగా ఉంటుంది. మార్పులు చేయాలంటే.. ఆ వ్యవహారంలో పాల్గొన్న నోడ్‌ల అనుమతి తప్పనిసరి.

చదవండి: కనిపించని కరెన్సీ గురించి తెలుసా..!

మరిన్ని వార్తలు