గ్లోబల్‌ మాంద్యం భయాలు: 5 లక్షల కోట్లు ఢమాల్‌

23 Sep, 2022 17:04 IST|Sakshi

దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్‌ బాత్‌ 

కీలక మద్దతు స్థాయిల దిగువకు సూచీలు

సాక్షి,ముంబై: బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్‌మాంద్యం, ముఖ్యంగా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డింపుతో దేశీయ స్టాక్‌మార్కెట్‌ భారీ పతనాన్ని నమోదు చేసింది. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రికార్డు కనిష్టానికి చేరింది. సెన్సెక్స్ 1020 పాయింట్ల నష్టంతో 58,098 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1.72 శాతం క్షీణించి 17,327 వద్ద ముగిసింది.

ఒక​ దశలో సెన్సెక్స్‌  57,981కి పడిపోయింది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్స్‌. ఆటో, ఐటీ రంగ షేర్లు నష్టపోయాయి. వరుసగా మూడో  సెషన్‌లో పతనాన్ని నమోదు చేయడమే కాదు,  వరుసగా నాల్గవ వారాంతంలోనూ క్షీణించాయి. అన్ని బిఎస్‌ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 276.6 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ ఒక్కరోజు ట్రేడర్లు  రూ.4.9 లక్షల కోట్ల మేర నష్ట పోయారు. టెక్నికల్‌గా సెన్సెక్స్‌ 59500 స్థాయిని నిఫ్టీ 17500 స్థాయికి చేరింది.  దీంతో ఇన్వెస్టర్లు టెక్నికల్‌  లెవల్స్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తారని, ఈ స్థాయిలు బ్రేక్‌ అయితే  అమ్మకాల వెల్లువ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

ప్రధానంగా ఫెడ్‌ వడ్డింపు, డాలర్ ఇండెక్స్ 20ఏళ్ల గరిష్టానికి చేరడంతో, రూపాయి పతనం,అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పతనం,ఎఫ్‌ఐఐల అమ్మకాలు బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీలో పతనం తదితర కారణాలు మార్కెట్ ఔట్‌లుక్‌ను బేరిష్‌గా మార్చాయి. దీనికి తోడుఫెడ్‌బాటలోనే ఆర్‌బీఐ కూడా రానున్న సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే  బ్రిటన్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు