‘రాఖీ ఎక్స్ ప్రెస్’ ఆఫర్ ను ప్రారంభించిన బ్లూ డార్ట్

4 Aug, 2021 14:28 IST|Sakshi

కరోనా యోధులందరి కోసం ప్రత్యేక ఆఫర్లు

భారతదేశంలోని ప్రముఖ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్, డాయిష్ పోస్ట్ డీహెచ్ఎల్ గ్రూప్ (డీపీడీహెచ్‌ఎల్‌)లో భాగమైన బ్లూ డార్ట్ తన రాఖీ ఎక్స్‌ప్రెస్ ఆఫర్‌ని ప్రారంభించింది. మరోసారి 'కనెక్టింగ్ పీపుల్, లైఫ్స్ ఇంప్రూవింగ్ లైఫ్' అనే తమ నినాదాన్ని వినిపించింది. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రియమైనవారితో కనెక్ట్ అవ్వడానికి వీలుకల్పించే ఈ ఆఫర్, ప్రతి భారతీయ పౌరుడిని రక్షించడానికి కృషి చేస్తున్న కోవిడ్‌-19 యోధులను అభినందించే, కృతజ్ఞతలు తెలియజేసే లక్ష్యంతో మొదలు పెట్టింది.

ప్రత్యేక తగ్గింపు ధర రూ.200కే కోవిడ్ -19 యోధులకు రాఖీ షిప్‌మెంట్ పంపడానికి లేదా స్వీకరించడానికి ఈ ఆఫర్ అవకాశం కల్పిస్తుంది. దేశీయంగా తమ తోబుట్టువులకు, ప్రియమైనవారికి రాఖీ షిప్మెంట్ పంపే కస్టమర్లకు 0.5 కిలోల బరువు కలిగిన షిప్మెంట్లపై రూ.250/- ప్రత్యేక తగ్గింపు ధర లభిస్తుంది. ప్రియమైనవారు కొన్నిసార్లు విదేశాలలో నివసిస్తారని బ్లూ డార్ట్ అర్థం చేసుకుంది, అందువల్ల, అన్ని అంతర్జాతీయ రాఖీ షిప్మెంట్లపై, కస్టమర్లు టైమ్ డెఫినిట్ ఎక్స్‌ప్రెస్ డెలివరీతో 0.5 Kg నుండి 2.5 Kg, 5kg, 10kg, 15kg, 20kg మధ్య షిప్మెంట్ల మూల ఛార్జీలపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు. ఆఫర్ కాలం జూలై 26, 2021 నుండి ఆగస్టు 23, 2021 వరకు ఉంటుంది. 

ఈ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ ప్రొవైడర్ దేశీయ రాఖీ షిప్మెంట్లు బుక్ చేసుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తమ ఔట్‌లెట్లలో అద్భుతమైన 'స్లోగన్ కాంటెస్ట్' నిర్వహిస్తోంది. కస్టమర్‌లు ఒక ఫారమ్‌ తీసుకొని, "మా కుటుంబం బ్లూడార్ట్‌ వారి రాఖీ ఎక్స్‌ప్రెస్‌ని ప్రేమిస్తుంది ఎందుకంటే ...." అన్న సులువైన నినాదాన్ని పూరించాలి. ఈ పోటీలో 10 అత్యంత వినూత్న నినాదాలు పేర్కొన్న వారికి స్మార్ట్‌ఫోన్‌లను బహూకరించనుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు