ఆ పరిశ్రమలో ఉద్యోగులకు యమ డిమాండ్‌.. ఖాళీలు ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయ్‌!

7 Jan, 2023 15:27 IST|Sakshi

ముంబై: గడిచిన ఏడాది కాలంలో (2021 నవంబర్‌ నుంచి 2022 నవంబర్‌ వరకు) కార్మికులు, గ్రే కాలర్‌ (టెక్నీషియన్లు మొదలైనవి) ఉద్యోగాలు నాలుగు రెట్లు పెరిగాయి. డిజిటైజేషన్, ఆటోమేషన్, మారుతున్న పని విధానాలు తదితర అంశాలు ఇందుకు కారణం. క్వెస్‌ కార్ప్‌ అనుబంధ సంస్థ బిలియన్‌ కెరియర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన పోస్టింగ్స్‌కు సంబంధించిన డేటాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

2021లో బ్లూ, గ్రే–కాలర్‌ పరిశ్రమలో ఖాళీలు 26.26 లక్షలుగా ఉండగా 2022లో 1.05 కోట్లకు పెరిగాయి. డేటా ప్రకారం కంపెనీలు ఉత్పాదకతను, సమర్ధతను పెంచుకునేందుకు నైపుణ్యాలున్న వారిని పెద్ద ఎత్తున తీసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. టెక్నాలజీ ద్వారా హైరింగ్‌ ప్రక్రియలను రిక్రూటర్లు గణనీయంగా మెరుగుపర్చుకుంటారని, ఉద్యోగులను అట్టే పెట్టుకోవడంపైనా దృష్టి పెట్టనున్నారని బిలియన్‌ కెరియర్స్‌ సీనియర్‌ వీపీ అజయ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు.

చదవండి: Jack Ma: సంచలన నిర్ణయం తీసుకున్న చైనా వ్యాపార దిగ్గజం

మరిన్ని వార్తలు