‘ముసలితనానికి కారణమేంటి’..అదే పనిగా సెల్ ఫోన్ వాడుతున్నారా?

2 Sep, 2022 15:22 IST|Sakshi

మనుషుల్ని ప్రేమించాలి..వస్తువుల్ని వాడుకోవాలి. కానీ అలా కాకుండా మనుషుల్ని వాడుకుంటూ..వస్తువుల్ని ప్రేమిస్తున్న యుక్త వయస‍్సు వారు తొందరగా ముసలోళ్లు అవుతున్నారంటూ షాకింగ్‌ రిపోర్ట్‌ వెలుగులోకి వచ్చింది.

అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. మనిషి జీవితంలో భాగమైంది. అది లేకపోతే ఏదో కోల్పోయామనే భావన కలుగుతోంది. స్మార్ట్‌ ఫోన్‌తో పాటు ఇయర్‌ ఫోన్స్‌,స్మార్ట్‌ వాచ్‌, ల్యాప్‌ట్యాప్‌తో పాటు ఇతర గాడ్జెట్స్‌పై అదే అభిప్రాయం ఉంటే ప్రమాదమని తెలుస్తోంది. ఎందుకంటే వాటివల్ల మానవళి మనుగడకు ముప్పు వాటిల్లుతున్నట్లు..ముఖ్యంగా గాడ్జెట్స్‌ వల్ల వయస్సు మీద పడి అనేక సమస్యల్లో చిక్కుకుంటున్నట్లు అమెరికాకు చెందిన ‘ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ’ అధ్యయనంలో తేలింది. 

ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్‌ ( Frontiers in Aging) అనే జర్నల్‌లో స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్‌ ట్యాప్స్‌తో పాటు ఇతర గాడ్జెట్స్‌ నుంచి అతిగా వినియోగించడం వల్ల.. వాటి నుంచి ప్రతిభించించే నీలి రంగు వెలుతురు వల్ల  త్వరగా యుక్త వయస్సు నుంచి వృద్ధాప్యంలోకి జారుకుంటున్నట్లు ఒరెగాన్‌ యూనివర్సిటీ ప్రతినిథులు తెలిపారు. 

ప్రతి రోజు టీవీ, ల్యాప్‌ ట్యాప్స్‌, స్మార్ట్‌ ఫోన్స్‌ వినియోగంతో మితిమీరిన కాంతి మనుషులు శరీరంపై పడుతుంది. తద్వారా శరీర కారణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మా రీసెర్చ్‌లో తేలింది. చర్మం, కొవ్వు కణాల నుంచి నాడికణాల (ఇంద్రియ న్యూరాన్లు) వరకు దుష్ప్రభావం చూపుతుందని యూనివర్సినీ ప్రొఫెసర్‌ జాడ్విగా గిబుల్టోవిచ్ చెప్పారు. 

చదవండి👉 మార్చుకోం : ఐఫోన్‌14 సిరీస్‌ విడుదలపై భారతీయులు ఏమంటున్నారంటే!

మరిన్ని వార్తలు