దేశీయ మార్కెట్లో కొత్త జర్మన్ లగ్జరీ కారు: ధర రూ. 68.90 లక్షలు

4 Mar, 2023 09:49 IST|Sakshi

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ భారతీయ మార్కెట్లో 2023 ప్రారంభం నుంచి కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు M స్పోర్ట్ రూపంలో 520d మోడల్ విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధర రూ. 68.90 లక్షలు.

బిఎమ్‌డబ్ల్యూ కంపెనీ 520డి విడుదల చేసిన సందర్భంగా 530డి ఎమ్ స్పోర్ట్, 520డి లగ్జరీ లైన్, 50 జహ్రే ఎమ్ ఎడిషన్‌లను నిలిపివేసింది. అయితే మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మోడల్ స్పోర్టియర్‌ ఎక్ట్సీరియర్‌ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ ఆప్రాన్లు, సైడ్ స్కర్ట్స్, గ్లోస్ బ్లాక్ కిడ్నీ గ్రిల్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌, బ్లూ బ్రేక్ కాలిపర్‌లు, క్రోమ్ ఎగ్జాస్ట్‌లతో కూడిన ఎమ్ స్పోర్ట్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో డోర్ సిల్స్, ఫ్లోర్ మ్యాట్స్, స్పోర్ట్స్ సీట్లు, లెదర్ స్టీరింగ్ వీల్‌ వంటి వాటితో పాటు, లేజర్‌లైట్ టెక్నాలజీ, హెడ్స్-అప్ డిస్‌ప్లే, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి.

(ఇదీ చదవండి: World's Richest Man: ఇప్పుడు ఎలాన్ మస్క్ కాదు, మరెవరో తెలుసా?)

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2.0-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 188 బిహెచ్‌పి పవర్, 1750 - 2500 ఆర్‌పిఎమ్ వద్ద 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి తగిన సన్నాహాలు కూడా సిద్ధం చేస్తోంది.

మరిన్ని వార్తలు