BMW Group India: బీఎండబ్ల్యూ దూకుడు..! భారత్‌లో తొలిసారిగా..!

4 Jan, 2022 19:49 IST|Sakshi

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్‌లో సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఎన్నడూలేని విధంగా 2021లో రికార్డుస్థాయిలో వాహనాల అమ్మకాలను జరిపినట్లు బీఎండబ్ల్యూ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. 

భారీగా పెరిగిన అమ్మకాలు..!
2021 భారత్‌లో బీఎండబ్ల్యూ  గణనీయమైన అమ్మకాలను  జరిపింది. గత ఏడాదిలో మొత్తంగా 8,876 కార్లను భారత్‌లో విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా టూవీలర్‌ వాహనాల్లో 5,191 యూనిట్లను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ వెల్లడించింది. టూవీలర్‌ వాహనాల అమ్మకాల్లో ఏకంగా 35 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసింది. 

మినీ కూపర్స్‌ కూడా అధికమే..!
బీఎండబ్ల్యూ వాహనాల్లో మినీ కూపర్స్‌ కూడా భారత్‌లో అత్యధిక ఆదరణను నోచుకున్నాయి. 2021లో 640 యూనిట్ల మినీ కూపర్‌ వాహనాలను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. బీఎండబ్ల్యూ ఎక్స్‌1, బీఎండబ్ల్యూ ఎక్స్‌3, బీఎండబ్ల్యూ ఎక్స్‌5 వాహనాలు భారీగా అమ్ముడైనాయి. వీటితో పాటుగా బీఎండబ్ల్యూ ఎమ్‌ 340ఐ ఎక్స్‌డిజైర్‌, బీఎండబ్ల్యూ ఎక్స్‌7, బీఎండబ్ల్యూ 3 సిరీస్‌ వాహనాల కోసం కొనుగోలుదారులు నెలల తరబడి వేచి ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

చదవండి: మెర్సిడెస్ బెంజ్ సూపర్ ఎలక్ట్రిక్ కారు.. కి.మీ రేంజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మరిన్ని వార్తలు