బీఎండబ్ల్యూ ఎక్స్‌4 ఎస్‌యూవీ కూపే: BMW X4, 2022

11 Mar, 2022 10:39 IST|Sakshi

BMW X4In India: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ తాజాగా ఎస్‌యూవీ కూపే ఎక్స్‌4 కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ. 70.5 లక్షలు కాగా, డీజిల్‌ వేరియంట్‌ రూ. 72.5 లక్షలుగా (ఎక్స్‌–షోరూమ్‌) ఉంటుందని సంస్థ తెలిపింది. స్పోర్ట్స్‌ యాక్టివిటీ కూపే (ఎస్‌ఏసీ)గా వ్యవ హరించే కారులో డిజైన్‌పరంగా మెరుగుపర్చడంతో పాటు మరిన్ని విడిభాగాలు, కొత్త ఫీచర్ల ను కూడా చేర్చినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా తెలిపారు.
 

దేశీయంగా చెన్నై ప్లాంటులో దీన్ని ఉత్పత్తి చేసినట్లు ఆయన వివరించారు. ’బ్లాక్‌ షాడో’ ఎడి షన్‌ పేరిట పరిమిత సంఖ్యలో ఈ మోడల్‌ లభిస్తుందన్నారు. డీజిల్‌ వేరియంట్‌ 5.8 సెకన్లలో, పెట్రోల్‌ వేరియంట్‌ 6.6 సెకన్లలో గంటకు 0–100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.  

మరిన్ని వార్తలు