భారత్‌లోకి అడుగుపెడుతున్న బీఎండబ్ల్యూ సూపర్‌ బైక్‌.. లాంచ్‌ ఎప్పుడంటే?

24 Nov, 2022 16:41 IST|Sakshi

దేశంలో బైక్‌ల వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రత్యేకంగా యువతలో వీటికి విపరీతమైన క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కంపెనీలు కూడా కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని కొత్త మోడల్స్‌పై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఏటా పలు రకాల మోడల్స్‌ బైకులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. తాజాగా యువతను ఆకట్టుకునేలా ప్రముఖ సంస్థ బీఎండబ్ల్యూ తన సూపర్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను లాంచ్‌ చేయనుంది.  

బీఎండబ్ల్యూ ఎస్‌ 1000 ఆర్‌ఆర్‌ ( BMW S 1000 RR) పేరుతో ఈ బైకును డిసెంబర్‌ 10న భారత మార్కెట్‌లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. 2023 BMW S 1000 RR ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది. అయితే ఈ ఏడాది భారత్‌లోకి రానున్న ఈ మోడల్‌ బైక్‌ అప్‌డేటెడ్‌ ఇంజిన్‌తో పాటు మునుపటి కంటే లేటెస్ట్‌ టెక్నాలజీతో రాబోతోంది.

ఈ బైక్‌.. మునుపటి వాటికంటే మెరుగ్గా!
బీఎండబ్ల్యూ ఫ్లాగ్‌షిప్‌ బైక్‌ల కంటే కొన్ని ముఖ్యమైన మార్పులతో ఈ బైక్‌ మార్కెట్లోకి రాబోతోంది. అత్యంత సమగ్రంగా సవరించిన ఛాసెస్‌ను కలిగి ఉండటం ఈ సూపర్‌ బైక్‌ ప్రాధాన్యత.  లేటెస్ట్‌ ఇంజిన్‌, సస్పెన్షన్‌ కంట్రెల్‌, ఛాసిస్‌, ఏరోడైనమిక్స్‌, డిజైన్‌ వంటి అప్‌డేట్‌లతో వస్తోంది. ఇది 999 సీసీ ఇన్లైన్‌ఫోర్‌ మోటార్‌ శక్తితో నడుస్తుంది. ఆరు గేర్లుండే ఈ బైక్‌ 13,750 ఆర్‌పీఎంతో మాగ్జిమమ్‌ పవర్‌ 206.5 బీహెచ్‌పీకి చేరుతుంది. ఈ బైక్ స్లయిడ్ కంట్రోల్‌ని కలిగి ఉంది. ఇందులో కొత్త డైనమిక్ బ్రేక్ కంట్రోల్ (DBC)తో వస్తుంది.

దీని ఇంజిన్ స్పీడ్ పరిధి మునుపటి కంటే ఇప్పుడు విస్తృతంగా ఉంది. ఇది మోటార్‌ను 14,600 rpm వరకు పుష్ చేయడంలో సహాయపడుతుంది. ఈ బైక్‌ వీల్‌బేస్ 1,441 mm నుంచి 1,457 mm వరకు పెరిగింది.  

ఇందులో కొత్త స్లయిడ్ కంట్రోల్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఈ బైక్‌ను కంపెనీ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా సేల్స్‌ జరపనున్నారు. దీని ధర ₹20-25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండచ్చని అంచనా. బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, స్టైల్ ప్యాషన్ రెడ్ నాన్-మెటాలిక్, లైట్ వైట్ నాన్-మెటాలిక్ రంగుల్లో ఈ స్పోర్ట్స్‌ బైక్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు.

చదవండి: షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్‌?

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు